
లండన్ రైలు ప్రమాదంలో కానూరు విద్యార్థి మృతి
పెనమలూరు : లండన్‌లో ఎంఎస్ చదివేందుకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి అక్కడ జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందాడు. కానూరులో ఉంటున్న ఇంజినీర్ దేవభక్తుని వినయ్‌కుమార్ కుమారుడు సుజిత్ ఈ నెల 21వ తేదీన లండన్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో ఎంఎస్ చదవడానికి వెళ్లాడు.
అక్కడినుంచి నివాసమండే రూమ్‌కు వెళ్లడానికి 22వ తేదీ సాయంత్రం లోకల్ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఫోన్ మాట్లాడుతుండగా రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో సుజిత్ మృతి చెందాడు. అతడు ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ చేశాడు. సుజిత్ భౌతికకాయాన్ని సోమవారం వీరులపాడులో ఉంటున్న తాత దేవభక్తుని రామమోహనరావు ఇంటికి తీసుకొస్తారని కుటుంబసభ్యులు తెలిపారు.