
Run Raja Run Herouine Seerat Kapoor Becomes Very Slim See Photos: 'రన్ రాజా రన్' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం అయిన హీరోయిన్ సీరత్ కపూర్. ఈ సినిమాలో‘బుజ్జి మా.. బుజ్జి మా’సాంగ్ ఎంతలా ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక తొలి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ ఆ తర్వాత రాజుగారి గది-2లో నటించింది. అయినప్పటికీ పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ తెగ యాక్టివ్‌గా కనిపిస్తుంది.
అయితే తాజాగా షేర్ చేసిన ఓ ఫోటోలో మాత్రం సీరత్ గుట్టుపట్టలేనంతగా మారిపోయింది. రన్ రాజా రన్ చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు బక్కచిక్కిపోయి సైజ్‌జీరోలా తయారైంది. దీంతో ఏమైంది నీకు ఇలా తయారయ్యావ్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.