
'ఆ సినిమా రీమేక్ కు డైరెక్షన్ చేయడం లేదు'
చెన్నై:2014 వ సంవత్సరంలో తెలుగులో ఘనవిజయం సాధించిన రన్ రాజా రన్ సినిమా తమిళ రీమేక్ కు తాను దర్శకత్వం వహించడం లేదని దర్శకుడు సుజిత్ స్పష్టం చేశాడు. ఆ సినిమాను తెలుగులో తాను తీసినా.. తమిళ రీమేక్ కు మాత్రం దర్శకత్వం వహించడం లేదన్నాడు. రన్ రాజా రన్ కు తాను దర్శకత్వం వహిస్తున్నట్లు వచ్చిన వార్తలను సుజిత్ తాజాగా ఖండించారు.
ప్రస్తుతం తన తదుపరి ప్రభాస్ చిత్ర స్క్రిప్ట్ లో బిజీగా ఉన్నట్లు సుజిత్ తెలిపాడు. అయినా తమిళ చిత్ర రీమేక్ కు తనను ఎవరూ సంప్రదించలేదన్నాడు. ఆ సినిమా రీమేక్ కు ఎవరు దర్శకత్వం వహిస్తున్నారో కూడా తనకు తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.