ఎక్స్‌ట్రార్డినరీ! | Sundeep Kishan's Tiger | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ట్రార్డినరీ!

Published Tue, Jan 13 2015 11:05 PM | Last Updated on Sun, Sep 15 2019 12:38 PM

ఎక్స్‌ట్రార్డినరీ! - Sakshi

ఎక్స్‌ట్రార్డినరీ!

 ‘‘కథను నమ్మి ఈ సినిమా చేస్తున్నా’’ అని సందీప్ కిషన్ పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఆయన హీరోగా రూపొందుతోన్న పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టైగర్’. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సీరత్‌కపూర్ ఇందులో కథానాయిక. ఏఆర్ మురుగదాస్ శిష్యుడు వి.ఐ. ఆనంద్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ, అగ్ర నిర్మాతలు ఎన్.వి. ప్రసాద్, ‘ఠాగూర్’ మధు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను సోమవారం మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత ఎన్.వి. ప్రసాద్, సమర్పకుడు ‘ఠాగూర్’ మధు మాట్లాడుతూ -‘‘ఎక్స్‌ట్రార్డినరీ కథ ఇది.
 
 సందీప్‌కిషన్‌ను హీరోగా మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా అవుతుంది. సాంకేతిక విలువలు గొప్పగా ఉంటాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. దాదాపుగా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ నెల 14న ‘ఐ’ సినిమాతో పాటు ఫస్ట్ టీజర్‌ను థియేటర్లలో విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘కాశీ నేపథ్యంలో సాగే కథ ఇది. వినోదానికి ప్రాధాన్యమున్న మంచి యాక్షన్ థ్రిల్లర్’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కె. నాయుడు, సంగీతం: తమన్, మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్, కో-డెరైక్టర్: పుల్లారావు కొప్పినీడి, లైన్ ప్రొడ్యూసర్: జి. నాగేశ్వరరావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement