ఆశ్చర్యపరిచే రన్...
‘‘ఓ కొత్త లుక్‌లో ఉండే సినిమా ఇది. శర్వానంద్ పాత్రచిత్రణ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ప్రేమ, వినోదాల కలబోతగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ సర్‌ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉంది’’ అని దర్శకుడు సుజీత్ చెప్పారు. ప్రభాస్‌తో ‘మిర్చి’ వంటి బ్లాక్ బస్టర్ తీసిన యు.వి.క్రియేషన్స్ అధినేతలు వంశీ, ప్రమోద్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం ‘రన్ రాజా రన్’. శర్వానంద్, సీరత్ కపూర్ ఇందులో హీరో హీరోయిన్లు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘కథకు ఈ టైటిల్ చక్కగా సరిపోతుంది. ‘మిర్చి’కి పని చేసిన మది ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ‘విశ్వరూపం-2’ చిత్రానికి సంగీతం చేసిన ఝిబ్రాన్. యమ్ దీనికి మంచి స్వరాలిచ్చారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అశోక్, లైన్ ప్రొడ్యూసర్: సందీప్.