శర్వానంద్ అలా అనడం గొప్ప విషయం : ప్రభాస్ | Prabhas, Gopichand to launched music of Run Raja Run | Sakshi
Sakshi News home page

శర్వానంద్ అలా అనడం గొప్ప విషయం : ప్రభాస్

Published Mon, Jun 16 2014 10:48 PM | Last Updated on Sat, Sep 2 2017 8:54 AM

శర్వానంద్ అలా అనడం గొప్ప విషయం  : ప్రభాస్

శర్వానంద్ అలా అనడం గొప్ప విషయం : ప్రభాస్

 ‘‘నాతో ’మిర్చి’వంటి ఘనవిజయాన్ని అందించిన నా మిత్రులు వంశీ, ప్రమోద్ ఇప్పుడు సుజిత్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుజిత్ ఈ కథ చెప్పినప్పుడే మంచి సినిమా అవుతుందనిపించింది’’ అని ప్రభాస్ చెప్పారు. శర్వానంద్, సీరత్‌కపూర్ జంటగా వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్న చిత్రం ‘రన్ రాజా రన్’. గిబ్రాన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో ప్రభాస్ విడుదల చేశారు. తొలి సీడీని హీరో గోపీచంద్ స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రాన్ని క్వాలిటీగా తీయండి చాలు.
 
 సినిమా విడుదల తర్వాత పారితోషికం తీసుకుంటా అని శర్వానంద్ అనడం గొప్ప విషయం. ప్రతి సన్నివేశం ఫ్రెష్‌గా ఉంది. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘బాహుబలి’ గురించి ప్రత్యేకంగా చెబుతూ.. ‘‘ఈ చిత్రాన్ని రాజమౌళి అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. అందరం ఎంతో కష్టపడి చేస్తున్నాం. వచ్చే ఏడాది జనవరి తర్వాత ఈ సినిమా విడుదల ఉంటుంది’’ అన్నారు. గోపీచంద్ మాట్లాడుతూ -‘‘నిర్మాతలుగా మొదటి సినిమా ‘మిర్చి’తోనే ఘనవిజయం సాధించారు వంశీ, ప్రమోద్. శర్వా నాకు తమ్ముడి లాంటి వాడు.
 
 తను చేసే చిత్రాలన్నీ విభిన్నంగా ఉంటాయి. ఈ సినిమా ఘనవిజయం సాధించాలి’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘కథే హీరో అని నమ్మి ఈ చిత్రాన్ని తీశారు నిర్మాతలు. వారి నమ్మకం వమ్ము కానివ్వకుండా నేను అనుకున్న కథను ఎంతో స్పష్టంగా తెరపై ఆవిష్కరించగలిగాను. శర్వాని నేను అనుకున్న విధంగా చక్కగా చూపించాను. కమల్‌హాసన్ సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ ఈ చిత్రానికి పాటలు ఇచ్చినందుకు గిబ్రాన్‌కి ధన్యవాదాలు’’ అని చెప్పారు. చిత్రబృందం అంతా ఎంతో కష్టపడి ఈ సినిమా చేశామని, విజయం సాధించాలని కోరుకుంటున్నానని శర్వానంద్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement