బాలయ్యకే ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్.. ఆసక్తిగా అన్‌స్టాపబుల్ ప్రోమో | Prabhas UnstoppableNBKS2 Part 2 Promo Released Today | Sakshi
Sakshi News home page

UnstoppableNBKS2 With Prabhas: బాలయ్యకు ప్రభాస్ ట్విస్ట్ .. ఆసక్తిగా అన్‌స్టాపబుల్ ప్రోమో

Published Wed, Jan 4 2023 7:33 PM | Last Updated on Wed, Jan 4 2023 7:37 PM

Prabhas UnstoppableNBKS2 Part 2 Promo Released Today - Sakshi

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్-2  ఓ రేంజ్‌లో దూసుకెళ్తోంది. టాలీవుడ్ ఫేమస్ సెలబ్రీటీలు హాజరవుతున్న ఈ షో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సీజన్‌లో రెబల్ స్టార్ ప్రభాస్, గోపీచంద్‌తో కలిసి హాజరవుతున్న పార్ట్-2  ప్రోమో రిలీజైంది. అయితే ఇప్పటికే ఓ ఎపిసోడ్‌ ప్రసారం కాగా.. మరో అదిరిపోయే ప్రోమోతో ఆహా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించింది. 

ఈ ప్రోమోలో బాలకృష్ణ.. ప్రభాస్, గోపీచంద్‌ను  సరదా ప్రశ్నలతో ముంచెత్తారు. ఈ ప్రోమోలో ప్రభాస్, గోపీచంద్‌ మధ్య మరింత సన్నివేశాలు ఆసక‍్తి పెంచుతున్నాయి. ఈ ఎపిసోడ్‌లో నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస‍్తోంది. 'డార్లింగ్ ఫ్యాన్స్‌కు పండుగ ముందే రాబోతోంది. మాకో స్టార్ గోపీచంద్‌తో ఫ్రెండ్షిప్ కథలు, బాహుబలి సినిమా విజయంపై సరదా ప్రశ్నలతో మరింత ఆసక్తి పెరుగుతోంది. జనవరి 6 వరకు వేచి ఉండండి.' అంటూ ఆహా ట్వీట్ చేసింది. జనవరి 6న రెండో పార్ట్ ప్రసారం కానున్నట్లు ఆహా ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement