‘బాహుబలి’ చిత్రం తెలుగు సినిమా స్థాయిని పెంచిందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో హీరోగా నటించిన ప్రభాస్ ఇమేజ్ ఇంటర్నేషనల్ రేంజ్‌కి వెళ్లిపోయింది. ఇప్పుడు ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్కీలు నిర్మిస్తున్న సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్, మురళీ శర్మ, ఎవెలిన్ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ తదితరులు నటిస్తున్నారు. మంగళవారం ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘షేడ్స్ ఆఫ్ సాహో’లో ఛాప్టర్ 1గా అబుదాబీలో జరిగిన ఈ చిత్రం చేజింగ్ సీన్ మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ లేటెస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ నయా లుక్, వీడియోను చూసి ‘సాహో రే డార్లింగ్’ అని çసంబరపడిపోతున్నారు. ‘‘ప్రభాస్ గత బర్త్ డేకి ‘సాహో’ లుక్‌ను రిలీజ్ చేశాం.
ఆ తర్వాత షూటింగ్‌తో అంతా బిజీగా ఉన్నాం. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ‘సాహో’ అప్‌డేట్స్ ఇవ్వమని సోషల్ మీడియాలో అడిగారు. అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేయడానికి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశాం. మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఇటలీలో జరుగుతోంది. 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. శంకర్–ఎహసాన్–లాయ్ సంగీతం, కెమెరామేన్ మధి విజువల్స్ ఈ సినిమాకు హైలైట్’’ అని చిత్రబృందం పేర్కొంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ‘సాహో’ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ కానుందని టాక్. ఈ సంగతి అలా ఉంచితే.. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ రీసెంట్‌గా ఇటలీలో పూర్తయింది. ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారు.
సాహో రే డార్లింగ్
Published Wed, Oct 24 2018 12:48 AM | Last Updated on Wed, Oct 24 2018 12:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment