
ప్రభాస్
‘సాహో, సాహో’ అంటూ తన గురించి మాత్రమే విన్నాం. మరి తను ఎలా ఉంటాడు? ఏం చేస్తుంటాడు? అన్నది మాత్రం తెలియదు. ఇప్పుడు ‘సాహో’ పాత్రలోని షేడ్స్‌ను ప్రేక్షకులకు చూపించనున్నారు చిత్రబృందం. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రద్ధా కపూర్ కథానాయిక. ఇవాళ ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ‘సాహో’ సినిమాలో ఆయన క్యారెక్టర్‌కు సంబంధించిన వీడియోను ‘షేడ్స్ ఆఫ్ సాహో’గా రిలీజ్ చేయనున్నారు. ఈ వీడియోను మంగళవారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనుంది చిత్రబృందం. అలాగే ఈ వీడియో సిరీస్‌లో ఈ భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకుంటారట. అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ కీలక పాత్రల్లో కనిపించనున్న ‘సాహో’ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment