లాయర్‌గా... | I play a lawyer in Batti Gul Meter Chalu | Sakshi
Sakshi News home page

లాయర్‌గా...

Published Fri, Jul 6 2018 12:37 AM | Last Updated on Fri, Jul 6 2018 12:37 AM

I play a lawyer in Batti Gul Meter Chalu - Sakshi

యామీ గౌతమ్‌

రీసెంట్‌గా డైలీ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు హీరోయిన్‌ యామీ గౌతమ్‌. అయితే సినిమా కోసం. ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’ ఫేమ్‌ శ్రీనారాయణ్‌సింగ్‌ దర్శకత్వంలో పవర్‌ కట్‌ ప్రాబ్లమ్స్‌ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘బట్టీ గుల్‌ మీటర్‌ చాలు’. షాహిద్‌ కపూర్, శ్రద్ధా కపూర్, యామీ గౌతమ్‌ ముఖ్య తారలుగా నటిస్తున్నారు. హీరో షాహిద్‌ కపూర్‌ దొంగగా నటిస్తున్న ఈ సినిమాలో యామీ గౌతమ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నటిస్తున్నారట.

ఈ పాత్ర కోసం ఆమె ఆల్రెడీ రియల్‌గా ముంబై హైకోర్టుకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారట. ప్రస్తుతం ముంబైలో వేసిన కోర్టు సెట్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమా షూట్‌లోనే లాయర్‌గా పాల్గొంటున్నారు యామీ గౌతమ్‌. మరి.. లాయరమ్మగా యామీ కోర్టులో ఏ రేంజ్‌లో వాదించారో చూడాలి. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. అన్నట్లు ‘నువ్విలా, గౌరవం, యుద్ధం’ సినిమాలతో యామీ తెలుగు తెరపై మెరిసిన విషయం గుర్తుండే ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement