
‘‘ఇటీవల వరుసగా అన్నీ యాక్షన్ ఫిల్మ్స్, ఫిజికల్‌గా ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే సినిమాలనే చేస్తున్నాను. అందుకే కొంచెం రూట్ మార్చాలనుకుంటున్నాను’’ అంటున్నారు ప్రభాస్. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సాహో’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయిక. 300 కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ‘మిర్చి’, ‘బాహుబలి, సాహో’.. ఇలా కంటిన్యూస్‌గా యాక్షన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ కెరీర్ ఫేజ్‌ని కొంచెం షిఫ్ట్ చేయాలనుకుంటున్నారట.
ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘ఈ మధ్య ‘సాహో’ కోసం దుబాయ్‌లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తీశాం. రియల్‌గా ఫైట్ చేయాల్సిందే. డూప్‌లకు స్కోప్ లేదు. అందుకే ఈ సినిమా తర్వాత కొంచెం రిలాక్సింగ్ మోడ్‌కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. యాక్షన్ నుంచి లవ్‌కి షిఫ్ట్ అవుతున్నా. రాధాకృష్ణ డైరెక్షన్‌లో చేయబోతున్నది మంచి లవ్‌స్టోరీ. ఇది యూరోప్‌లో జరిగే లవ్‌స్టోరీ. నాలోని డిఫరెంట్ యాంగిల్‌ని చూస్తారు. యాక్షన్ హీరోగా వెళుతున్న నా గ్రాఫ్‌లో కొంచెం చేంజ్ రావడానికి ఈ సినిమా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు ప్రభాస్.
Comments
Please login to add a commentAdd a comment