
‘‘ఆమె డెడికేషన్, హార్డ్ వర్కింగ్ నేచర్ కచ్చితంగా అభినందనీయం’’ అని తన కో–స్టార్ శ్రద్ధా కపూర్‌ని పొగడ్తల్లో ముంచెత్తారు ‘బాహుబలి’ ప్రభాస్. సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న ‘సాహో’లో ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికి రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి ప్రభాస్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాలో శ్రద్ధాను కేవలం పాటల్లో కనిపించటం కోసం, డాన్స్ సీక్వెన్స్ కోసం తీసుకోలేదు. తన పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. శ్రద్ధా స్వయంగా కొన్ని స్టంట్స్ కూడా ఫెర్ఫామ్ చేయబోతున్నారు.
తను మా టీమ్‌లో జాయిన్ అయినందుకు టీమ్ అంతా చాలా సంతోషంగా ఉంది’’ అని శ్రద్ధా కపూర్‌పై ప్రశంసల వర్షం కురిపించేశారు ప్రభాస్. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో హాలిడేలో ఉన్న ప్రభాస్ జనవరిలో హైదరాబాద్ తిరిగి రానున్నారు. వచ్చిన వెంటనే 45 రోజులు లాంగ్ షెడ్యూల్‌లో పాల్గొననున్నార ట. ఈ షెడ్యూల్‌ను జనవరి 5 నుంచి ప్లాన్ చేశారని సమాచారం. ఇదిలా ఉంటే ‘రాజా రాణి, అదిరింది’ చిత్రాల దర్శకుడు అట్లీతో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్టు కోలీవుడ్ టాక్. అదే విధంగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణతో కూడా ఒక సినిమా చేయనున్నారు ప్రభాస్. మరి ఏ సినిమా ముందు సెట్స్ పైకి వెళ్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment