నితేష్ తివారీ
నితేష్ తివారీ దర్శకత్వంలో వచ్చిన ‘దంగల్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ఆమిర్ ఖాన్, ఫాతిమా సనా షేక్, జైరా వసీమ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం చైనా, జపాన్ దేశాల్లో కూడా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఇప్పుడు నితేష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం చిత్రీకరణ ముంబైలో ఆదివారం మొదలైంది.
ఈ చిత్రానికి ‘ఛిచ్చోరే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘‘ఈ రోజు నా జీవితంలో ప్రత్యేకమైనది. ఎందుకుంటే నా తాజా సినిమా షూటింగ్ మొదలైంది. కొత్త ప్రయాణం’’ అని పేర్కొన్నారు తివారీ. సాజిద్ నడియాద్‌వాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరో హీరోయిన్లుగా ఎవరు నటిస్తున్నారన్న విషయాన్ని నితేష్ బయటపెట్టలేదు. కానీ సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధాకపూర్, ప్రతీక్ బబ్బర్, వరుణ్ శర్మ పేర్లు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment