సూపర్‌ హ్యాపీ | Confirmed! It's Yami Gautam opposite Shahid Kapoor in Batti Gul Meter Chalu | Sakshi
Sakshi News home page

సూపర్‌ హ్యాపీ

Published Mon, Jan 8 2018 12:59 AM | Last Updated on Mon, Jan 8 2018 12:59 AM

Confirmed! It's Yami Gautam opposite Shahid Kapoor in Batti Gul Meter Chalu - Sakshi

ఆయనో లాయర్‌. అందరి కేసులను వాదించి ఓ పరిష్కారం చూపిస్తూ ఉంటాడు. పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌  సంస్థలు, వాళ్లు విధించే బిల్లుల మీద పోరాటం చేసే కామన్‌ మేన్‌కి ఈ లాయర్‌ ఏ విధంగా సహకరించాడనే కథాంశంతో రూపొందుతున్న సినిమా ‘బట్టి గుల్‌ మీటర్‌ చలే’. ‘టాయిలెట్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ’ ఫేమ్‌ శ్రీ నారాయణ్‌ సింగ్‌ దర్శకుడు. ఈ సినిమాలో షాహిద్‌ కపూర్‌ లాయర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఇందులో కథానాయికగా శ్రద్ధా కపూర్‌ని తీసుకున్న విషయం తెలిసిందే.

ఇంకో హీరోయిన్‌గా యామీ గౌతమ్‌ని సెలెక్ట్‌ చేసుకున్నారు చిత్రబృందం. ‘‘ఈ సినిమాలో భాగం కావటం సూపర్‌ హ్యాపీగా ఉంది. షూటింగ్‌ కోసం చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను’’ అని పేర్కొన్నారు యామీ గౌతమ్‌. అందరి సమస్యలు పరిష్కరించే లాయర్‌గారు ఈ ఇద్దరి భామల మధ్య ఎలాంటి సమస్యగా మారాడు? ఇద్దరికీ ఎలాంటి సమాధానం ఇచ్చాడు? అంటే ఆగస్ట్‌ వరకూ ఆగాల్సిందే అంటున్నారు చిత్రబృందం. ఈ నెలాఖరున సెట్స్‌ పైకి వెళ్లనున్నఈ సినిమా ఆగస్ట్‌ 31న విడుదలకానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement