భాగ్యనగరం టు ముంబై | Prabhas Sahoo Movie Team Going to Mumbai Shooting Schedule | Sakshi
Sakshi News home page

భాగ్యనగరం టు ముంబై

Published Tue, Sep 25 2018 4:31 AM | Last Updated on Tue, Sep 25 2018 4:31 AM

Prabhas Sahoo Movie Team Going to Mumbai Shooting Schedule - Sakshi

ప్రభాస్‌

ప్రభాస్‌ అభిమానులంతా వెయిటింగ్‌. కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ చేశారు. ఎందుకు? అంటే... ప్రభాస్‌ పుట్టినరోజు కోసం. వచ్చే నెల 23న ఈ యంగ్‌ రెబల్‌ స్టార్‌ పుట్టినరోజు. ఆ రోజు ‘సాహో’ టీజర్‌ రూపంలో గిఫ్ట్‌ ఇస్తారన్నది అభిమానుల అంచనా. చిత్రబృందం కూడా ఫ్యాన్స్‌కి స్వీట్‌ షాకివ్వాలనుకుంటోందట. ఆ సంగతలా ఉంచితే.. ప్రస్తుతం హైదరాబాద్‌లో ‘సాహో’ షూటింగ్‌తో బిజీగా ఉన్న ప్రభాస్‌ త్వరలో ముంబై వెళ్లనున్నారు.

కొత్త హిందీ సినిమా ఏదైనా ఒప్పుకుని, ఆ షూటింగ్‌ కోసం అనుకుంటారేమో. అదేం కాదు. ‘సాహో’ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ముంబైలో చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశారట. ముందు అబుదాబీలో    భారీ షెడ్యూల్‌ చేసిన ఈ చిత్రబృందం దాదాపు నెల రోజుల నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతోంది. ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటిస్తు్తన్నారు. సుజిత్‌ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement