పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సాలిడ్ యాక్షన్ మూవీ 'సలార్' టీజర్‌తో బరిలోకి దిగాడు. 'కేజీయఫ్' సిరీస్ లాంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రభాస్‌ను ఏ రేంజ్‌లో అయితే చూపించాలో ఏ మాత్రం తగ్గకుండా టీజర్‌లో చూపించాడు. డార్లింగ్ ఫ్యాన్స్ అంచనాలకు కొంచెం కూడా తగ్గకుండా టీజర్‌ను 'ది మోస్ట్ వైలెంట్ మెన్.. కాల్డ్ వన్ మెన్.. ది మోస్ట్ వైలెంట్' పేరుతో మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
ఓ రకంగా ఉదయం 5: 12 నుంచి యూట్యూబ్‌లో తుఫాన్ మొదలైంది. టాలీవుడ్‌లో ప్రభాస్‌కు ఉండేది ఫ్యాన్స్ కాదు... డైహార్డ్ ఫ్యాన్స్ కాబట్టి ఈ టీజర్‌ను వారు మినిమమ్ పదిసార్లు అయినా ఇప్పటికే చూసి ఉంటారు. ఈ టీజర్‌లోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను వారు గుర్తించారు. దీంతో కేజీఎఫ్‌కు సలార్ కొనసాగింపు నిజమేనని తేలిపోయింది. ఇందులో రాఖీ భాయ్ కూడా ఉంటారనేందుకు మరింత బలం కూడా చేకూరింది.
(ఇదీ చదవండి; Prabhas Salaar Teaser: లయన్, చీతా, టైగర్ అంటూ వేటకొచ్చిన డైనోసార్)
ఇది ప్రభాస్, యష్ మధ్య అతిపెద్ద క్రాసర్‌ను సూచిస్తుంది. ప్రభాస్ సలార్ టీజర్ చూసిన తర్వాత కేజీఎఫ్-2 కు ఖచ్చితంగా కనెక్షన్ ఉందని తెలుస్తోంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అది నిజమేనని తెలిపేలా రెండు ఫోటోలను కూడా ప్రభాస్ ఫ్యాన్స్ గుర్తించారు. సలార్, KGF-2 కు సంబంధించిన రెండు స్క్రీన్‌షాట్‌లను తీసి వైరల్ చేస్తున్నారు. దీంతో కేజీఎఫ్‌తో సలార్‌కు కనెక్షన్ ఉందిని తేలిపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చేలా ఈ సీన్స్ ఉన్నాయి. వీటికి సంబంధించి టీజర్‌లో చాలా క్లూస్ ఇచ్చాడు ప్రశాంత్.
(ఇదీ చదవండి: పెళ్లి కూతురి లుక్‌లో సమంత.. వీడియో వైరల్)
వాటి ద్వారా సలార్,కేజీఎఫ్‌కు ఖచ్చితంగా కనెక్షన్ ఉందని చెప్పవచ్చు. ప్రభాస్‌తో పాటు రాఖీ భాయ్ కూడా సలార్‌లో జరిగే వార్‌లో ఉండబోతున్నట్లు ఖాయమేనని తెలుస్తోంది. వీరిద్దరూ పాన్ ఇండియా హీరోలే.. ఒకరి సినిమా విడుదలైతేనే బాక్సాఫీస్ బద్దలవుతుంది. అలాంటిది వీరిద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 2000 కోట్లు పైగా కలెక్ట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. సెప్టెంబరు 28న మొదటి భాగం రానున్నట్లు మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇండియన్ సినిమా చరిత్రలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ.
Comments
Please login to add a commentAdd a comment