డార్లింగ్ ప్రభాస్ 'సలార్' సినిమా టీజర్ ఎలా ఉందనేది పక్కనబెడితే.. యూట్యూబ్ లో మాత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. వ్యూస్, లైక్స్, షేర్స్ ఇలా ప్రతిదానిలోనూ టాప్ లోకి దూసుకెళ్లిపోయింది. థియేటర్లలోకి ఈ మూవీ రావడానికి మరో మూడు నెలల సమయముంది. కానీ ఇప్పటికే అంచనాలు కోటలు దాటేస్తున్నాయి. అయితే ఇక్కడే ఓ విషయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అదే సినీ ప్రేక్షకుల మధ్య చర్చకు కారణమైంది.
(ఇదీ చదవండి: 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలుసా?)
లైకుల రికార్డు
స్టార్ హీరో సినిమాల సందడంటే ఒకప్పుడు వేరుగా ఉండేది. ముందుగా పాటలు, అవొచ్చిన కొన్నాళ్లకు థియేటర్లలోకి సినిమా వచ్చేది. ఇప్పుడేమో ట్రెండ్ మారిపోయింది. ఫస్ట్ లుక్, టీజర్, లిరికల్ సాంగ్స్, ట్రైలర్.. ఇవన్నీ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ అన్నట్లు మారిపోయింది. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సలార్' టీజర్ కేవలం 6 గంటల్లోనే మిలియన్ లైక్స్ సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది.
ప్రభాస్ టాప్
ఇలా జస్ట్ టీజర్‌తో అతి తక్కువ సమయంలో మిలియన్ లైక్స్ సాధించిన హీరోగా టాలీవుడ్‌లో ప్రభాస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. మిగతా హీరోల్లో జూ.ఎన్టీఆర్-36 గంటలు, అల్లు అర్జున్-2 రోజుల 11 గంటలు, మహేశ్ బాబు- 18 రోజులు, రామ్ చరణ్- 20 నెలల సమయం తీసుకున్నారు. ఇదంతా చూస్తుంటే సినిమాలపై అంచనాలు పెరగడం, థియేటర్లలోకి వచ‍్చిన తర్వాత ప్రేక్షకుల్ని అలరించడం అన‍్న దానికంటే సినిమా అనేది నంబర్ల గేమ్‌లా మారుతోందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
Fastest 1M Liked Teasers Of Tollywood Heroes:
— Hail Prabhas (@HailPrabhas007) July 6, 2023
1. #Prabhas- 6Hrs 👑🔥🔥
2. #JrNtr- 36Hrs
3. #AlluArjun- 2 Days 11hrs
4. #MaheshBabu- 18 Days
5. #RamCharan- 20 Months pic.twitter.com/cBXcMzfnUp
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 24 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment