Likes
-
ఆ హీరో అంటే చాలా ఇష్టం, తనతో నటించాలనుంది: కీర్తి సురేశ్ (ఫొటోలు)
-
పుష్ప-2 టీజర్.. ఆ సినిమాను దాటలేకపోయింది!
ఐకాన్ స్టార్ పుష్ప-2 ది రూల్ చిత్రానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు బర్త్ డే రోజే అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. పుష్ప-2 టీజర్‌ను పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేశారు. అయితే విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఒక్కసారిగా నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అయితే ఆ ఒక్క విషయంలో మాత్రం పుష్ప-2 రికార్డ్ బ్రేక్ చేయలేకపోయింది. ప్రభాస్ సలార్ మూవీ టీజర్ రికార్డ్‌ను అధిగమించలేకోపోయింది. సలార్ టీజర్ రిలీజైనప్పుడు కేవలం 6 గంటల 15 నిమిషాల్లో 1 మిలియన్ లైక్స్ వచ్చాయి. అదే లైక్స్ పుష్ప-2 టీజర్‌కు రావడానికి 9 గంటల 59 నిమిషాలు పట్టింది. ఇక ఇదే జాబితాలో ఆర్ఆర్ఆర్ చిత్రం 36 గంటల 4 నిమిషాలతో మూడుస్థానంలో ఉంది. ఏదేమైనా యూట్యూబ్‌లో మాత్రం రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కోటలు దాటుతున్న అంచనాలు.. సినిమానా? నంబర్ల గేమా?
డార్లింగ్ ప్రభాస్ 'సలార్' సినిమా టీజర్ ఎలా ఉందనేది పక్కనబెడితే.. యూట్యూబ్ లో మాత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. వ్యూస్, లైక్స్, షేర్స్ ఇలా ప్రతిదానిలోనూ టాప్ లోకి దూసుకెళ్లిపోయింది. థియేటర్లలోకి ఈ మూవీ రావడానికి మరో మూడు నెలల సమయముంది. కానీ ఇప్పటికే అంచనాలు కోటలు దాటేస్తున్నాయి. అయితే ఇక్కడే ఓ విషయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అదే సినీ ప్రేక్షకుల మధ్య చర్చకు కారణమైంది. (ఇదీ చదవండి: 'సలార్'కి ఎలివేషన్స్ ఇచ్చిన తాత ఎవరో తెలుసా?) లైకుల రికార్డు స్టార్ హీరో సినిమాల సందడంటే ఒకప్పుడు వేరుగా ఉండేది. ముందుగా పాటలు, అవొచ్చిన కొన్నాళ్లకు థియేటర్లలోకి సినిమా వచ్చేది. ఇప్పుడేమో ట్రెండ్ మారిపోయింది. ఫస్ట్ లుక్, టీజర్, లిరికల్ సాంగ్స్, ట్రైలర్.. ఇవన్నీ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ అన్నట్లు మారిపోయింది. తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'సలార్' టీజర్ కేవలం 6 గంటల్లోనే మిలియన్ లైక్స్ సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ప్రభాస్ టాప్ ఇలా జస్ట్ టీజర్‌తో అతి తక్కువ సమయంలో మిలియన్ లైక్స్ సాధించిన హీరోగా టాలీవుడ్లో ప్రభాస్ రికార్డు సొంతం చేసుకున్నాడు. మిగతా హీరోల్లో జూ.ఎన్టీఆర్-36 గంటలు, అల్లు అర్జున్-2 రోజుల 11 గంటలు, మహేశ్ బాబు- 18 రోజులు, రామ్ చరణ్- 20 నెలల సమయం తీసుకున్నారు. ఇదంతా చూస్తుంటే సినిమాలపై అంచనాలు పెరగడం, థియేటర్లలోకి వచ్చిన తర్వాత ప్రేక్షకుల్ని అలరించడం అన్న దానికంటే సినిమా అనేది నంబర్ల గేమ్‌లా మారుతోందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. Fastest 1M Liked Teasers Of Tollywood Heroes: 1. #Prabhas- 6Hrs 👑🔥🔥 2. #JrNtr- 36Hrs 3. #AlluArjun- 2 Days 11hrs 4. #MaheshBabu- 18 Days 5. #RamCharan- 20 Months pic.twitter.com/cBXcMzfnUp — Hail Prabhas (@HailPrabhas007) July 6, 2023 (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 24 సినిమాలు) -
సోషల్ మీడియా: కెరీర్‌కు సైతం తీవ్ర నష్టం
సాక్షి, హైదరాబాద్: నగరవాసులకు ‘లైక్’ల పిచ్చి పట్టుకుంది! తెల్లారింది మొదలు అర్ధరాత్రి వరకూ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ వంటి వాటితోనే ఇంటిల్లిపాదీ ప్రత్యేకించి యువత కాలక్షేపం చేస్తూ లైక్‌లు, కామెంట్ల కోసం వెంపర్లాడుతోంది!! ఒకవేళ ఆశించిన రీతిలో లైక్‌లు రాకపోతే మాత్రం గంగవెర్రులెత్తుతోంది. చివరకు శారీరక, మానసిక రుగ్మతలను కొనితెచ్చుకుంటోంది!! భాగ్యనగరంలో మొబైల్ డేటా వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నట్లుగానే అతిగా సోషల్ మీడియా వాడకం సైతం అంతకంతకూ అధికం అవుతోంది. అయితే ఈ పరిణామం క్రమంగా నగరవాసుల్లో మానసిక సమస్యలకు దారితీస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, స్నాప్‌చాట్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్, వాట్సాప్ స్టేటస్‌లకు ఆశించిన స్థాయిలో లైక్‌లు, కామెంట్లు, వ్యూస్, రివ్యూలు రాకపోయినా మానసికంగా కుంగిపోతున్న వారి సంఖ్య పెరుగుతోందని పేర్కొంటున్నారు. రాయల్ సొసైటీ ఫర్ పబ్లిక్ హెల్త్ తాజాగా నిర్వహించిన సర్వేలో 16 నుంచి 24 ఏళ్ల వయస్కుల్లో 91% మంది, 25–34 ఏళ్ల వయసు వారిలో 80% మంది, 35–44 ఏళ్ల వయసు వారిలో 70% మంది అతిగా సోషల్ మీడియాను వాడుతున్నారని తేల్చింది. దీంతో వారిలో చాలా మంది స్థూలకాలయం, మెడ, వెన్నుపూస, కంటి సమస్యల బారినపడుతున్నారని పేర్కొంది. చీప్‌గా ఇంటర్నెట్ డేటా... సెల్‌ఫోన్ నెట్వర్కింగ్ కంపెనీలు కాల్స్, ఇంటర్నెట్ డేటా కారుచౌకగా లేదా దాదాపు ఉచితంగా అందిస్తుండటంతో నగరవాసుల్లో అధిక శాతం మంది నెట్ డేటాను తెగ వాడేస్తున్నారు. దీనికితోడు షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, బస్టాండ్లు, ఆఫీసుల్లో ఉచిత వైఫై సేవలు కూడా లభిస్తుండటంతో వీలైనంతగా సోషల్ మీడియాను వాడేస్తున్నారు. దీంతో హైదరాబాద్‌లో డేటా వినియోగం గత మూడేళ్లలో 25 శాతానికిపైగా పెరిగిందని ఓ ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ రీజినల్ మేనేజర్ పేర్కొన్నారు. అందరూ ‘సోషల్’బానిసలే...! సోషల్ మీడియాకు ఇంటిల్లిపాదీ బానిసలవుతోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ యూట్యూబ్, ఫేస్బుక్ వంటి వాటినే నగరవాసులు ఎక్కువగా వీక్షిస్తున్నారు. ఇళ్లలోని చిన్నారులెవరైనా గుక్కపట్టి ఏడుస్తుంటే పెద్దలు వారికి స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలు పెట్టి సముదాయిస్తున్నారు. తల్లిదండ్రులతోపాటు ఇతర కుటుంబ సభ్యులు పగలూరాత్రి సోషల్ మీడియాతోనే ఎక్కువగా కాలక్షేపం చేస్తుండటంతో చిన్నారులు సైతం స్మార్ట్ఫోన్లకు అలవాటవుతున్నారు. ముఖ్యంగా స్కూలు పిల్లలు ఇంటికి రాగానే స్మార్ట్‌ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు. దీనికితోడు పాఠాలు బోధించే యాప్‌లు సైతం అందుబాటులోకి రావడంతో విద్యార్థుల్లో స్మార్ట్ఫోన్ల వాడకం మరింత పెరిగింది. ఇన్ఫిరియారిటీ పెరుగుతుంది.. సోషల్ మీడియా అతి వాడకం వల్ల చాలా కుటుంబాల్లో తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఎవరికి వారు ఒంటరిగా ఫీలవుతున్నారు. హైదరాబాద్‌లో ఈ అలవాటుతో వచ్చే డిప్రెషన్, యాంగ్జైటీ కేసులు ఎక్కువయ్యాయి. సోషల్ మీడియాలో కనిపించే స్నేహితుల ఫొటోలు, వారి డ్రెస్సింగ్ వంటివి యువతలో ఇన్ఫీరియారిటీ లక్షణాలను పెంచుతున్నాయి. తోటి వారి కంటే తాము ఎంతో తక్కువ అనే భావంతో కుంగిపోతున్నారు. ఇది వారి కెరీర్‌కు తీవ్ర నష్టం కలిగిస్తుంది. – డాక్టర్ సంహిత, సీనియర్ సైకియాట్రిస్ట్ చాలా మందికి కంటి సమస్యలు గంటల తరబడి స్మార్ట్ఫోన్ల వాడకం వల్ల కంటి సమస్యలతో బాధపడుతూ మా దగ్గరకు వచ్చే రోగుల సంఖ్య ఇటీవల పెరిగింది. రాత్రివేళల్లో నిద్రపోయే ముందు ఫోన్ వాడటం వల్ల నిద్రలేమితోపాటు కళ్ల మంటలు వస్తాయి. కంటి ఎలర్జీ, ఇన్ఫెక్షన్లు వచ్చినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కంటి వైద్యులను సంప్రదించాలి. ప్రశాంత్ గుప్తా, ఆఫ్తాల్మాలజిస్ట్, అపోలో హస్సిటల్స్ నేను గతంలో యూట్యూబ్, వాట్సాప్ మెసేజీలకు అలవాటుపడిపోయా. రోజూ దాదాపు 3 గంటలు వాటితోనే కాలక్షేపం చేసేదాన్ని. ఇదో వ్యసనంలా మారింది. 2, 3 నెలల తర్వాత పరిస్థితి అర్థం చేసుకొని ఫోన్లో వీడియోలు చూసేందుకు ఓ టైం పెట్టుకున్నా. – రాజ్యలక్ష్మి, గృహిణి -
ఇల్లు ఇరుగ్గా ఉంది అత్తయ్యా
అందరూ కలిసి ఉండాలనేది మంచి ఆలోచన.అందులో లాభాలు ఉన్నాయి.సౌకర్యాలు ఉన్నాయి.కాని అత్తగారు ప్రతి కొడుక్కీ గది సౌకర్యంగా ఉందా అని చూస్తే సరిపోదు.ప్రతి కోడలికి గాలి ఆడుతుందా అనేది కూడా చూడాలి.ఇష్టాలు గౌరవించుకుంటే బంధాలు మరింత బలపడతాయి. ఆ రెండంతస్తుల భవనంలో లోపలి మెట్ల ద్వారా ఏ గదికైనా చేరుకోవచ్చు.అంత సౌకర్యంగా కట్టారు.కాని ఆ ఇంటికే కాక ఆ ఇంట్లోని మనుషులకూ మెట్లు ఉన్నాయి.పై మెట్టు మీద ఒకరుంటారు.. కింద మెట్టు మీద ఒకరుంటారు.అది మాత్రం చాలా అసౌకర్యం. వర్తకుల ఇల్లు అది. ఉత్తరాది నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఉమ్మడి కుటుంబం. తల్లి– తండ్రి, ముగ్గురు కొడుకులు– కోడళ్లు, మనవలు–మనవరాళ్లు... అందరూ కలిసి ఉంటారు. వంట గదిలో నిప్పు ఆరదు. డైనింగ్ టేబుల్‌కు విశ్రాంతి ఉండదు. తిండికి కొదవ లేదు. కాని మనసుల్లోనే ఏదో వెలితి. ఆ ఇంటి చిన్న కోడలు సోనమ్ పూర్తిగా మారిపోయిందని తెలియడానికి అంత ఉమ్మడి కుటుంబంలోని మనుషులకు కూడా ఆరు నెలలు పట్టింది. చిన్న కోడలు అంటే వయసులో చిన్నదని అనుకోవాల్సిన పని లేదు. 42 ఉంటాయి. పదిహేడు పద్దెనిమిదేళ్లకే పెళ్లి చేసి తీసుకొచ్చారు. ఇరవై ఏళ్ల కొడుకు, పద్దెనిమిదేళ్ల కూతురు ఉన్నారు. ముందు నుంచి మెతక. అత్తగారు ఏం చెప్పినా చేసుకుపోతుందని పేరు. అత్తగారి తర్వాత? పెద్ద కోడలు ఏం చెప్పినా చేసుకుపోతుందని పేరు. పెద్ద కోడలి తర్వాత? రెండో కోడలు ఏం చెప్పినా చేసుకుపోతుందని పేరు.ఇరవై ఏళ్లుగా చేసుకుపోతూనే ఉంది. చేసుకుపోతూనే ఉంది కదా అని ఎవరూ గమనించలేదు.గమనించేసరికి ఆమె పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. అత్తగారు లేచే సమయానికి కోడళ్లు కూడా నిద్ర లేవాలి. కాని గత ఆర్నెల్లుగా చిన్న కోడలు సమయానికి లేవడం లేదు. ఊరికే అలా పడుకుని ఉంటోంది. లేచినా తయారు కావడం లేదు. స్నానం చేయడం లేదు. దొడ్లోకి ఎప్పుడు వెళుతున్నదో అసలు వెళుతున్నదో లేదో తెలియదు. తిండి పూర్తిగా తగ్గిపోయింది. అప్పడప్పుడు ఆమె బాగా నవ్వేది. అసలు నవ్వు కనిపించడం లేదు. కొద్దో గొప్పో మాట్లాడేది. మాట వినిపించడం లేదు. అత్తగారు, తోడి కోడళ్లు కూడా మనుషులే. ఒక మనిషి ఈ స్థాయికి పడిపోయాకైనా వారు గమనించే తీరుతారు. గమనించారు. ఆస్పత్రికి తీసుకొచ్చారుసైకియాట్రిస్ట్ దగ్గరకు. సోనమ్‌కు చదువుకోవాలని ఉండేది. ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకుంది. కాని చదువు మాన్పించి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. సరే.. భర్తను బాగా చూసుకోవడం.. భర్త చేసే పనిలో సాయం చేయడం.. పిల్లలను తీర్చిదిద్దుకోవడం.. ఇవైనా బాగా చేద్దామని అనుకుంది. ఆ కుటుంబ వర్తకంలో భర్త రాణించేది తక్కువ. అందుకని అతడికి తక్కువ స్థాయి పని అప్పజెప్పి ఉన్నారు. కనుక తక్కువ స్థాయి మర్యాద కూడా ఉంది. అతనికి తక్కువ స్థాయి మర్యాద కనుక అతడి భార్యకు కూడా తక్కువ స్థాయి మర్యాదే. నిర్ణయాలు మావగారు, ఇద్దరు బావగార్లు తీసుకుంటూ ఉంటారు. భర్తకే నిర్ణయం తీసుకునే వీలు లేనప్పుడు అతడి భార్యకు వీలు ఎక్కడ ఉంటుంది.ఆ ఇంట్లో తనకు నచ్చింది వండుకుని తినే స్వేచ్ఛ సోనమ్‌కు ఎప్పుడూ లేదు. వండుకోవద్దని ఎవరూ అనరు. కాని వండుకోవడానికి వీల్లేని వాతావరణం ఉంటుంది. పిల్లలు ఇద్దరు పుడితే తనకిష్టమైన పేర్లు సోనమ్ పెట్టుకోలేకపోయింది. భర్తకు ఇష్టమైన పేర్లు కూడా. ఒక పేరు పెదబావగారు పెడితే మరోపేరు రెండో బావగారు పెట్టారు.సంవత్సరానికి రెండుసార్లు అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్లి వస్తారు గాని సోనమ్‌కు తన కుటుంబంతో విడిగా ఎక్కడికైనా వెళ్లి రావాలనే కోరిక మాత్రం ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా తీరలేదు. ‘అలాగే అత్తగారు’, ‘అలాగే ఒదిన’... ‘అలాగే మావయ్యా’ ఇవి అనీ అనీ నిద్రలో కూడా ఈ మాటలే అనడానికి అలవాటు పడిపోయింది.అసంతృప్తికీ అణచివేతకీ కూడా ఒక హద్దు ఉంటుంది.ఆ చెలియలి కట్టను కూడా ఆ కుటుంబం దాటి సోనమ్‌ను తీవ్రంగా బాధ పెట్టింది. సోనమ్ కుమార్తె వీర ఇంటర్ పాసైంది. ఇక ఇంట్లో అందరూ పెళ్లి సంబంధాల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. తమ ఇళ్లల్లో ఆడపిల్లలకు ఆ వయసులో పెళ్లి చేస్తారు కనుక ఇది చాలా మామూలు విషయంగా వారు భావించారు. అత్తగారు, ఇద్దరు పెద్ద కోడళ్లు ఆ సంబంధం ఉంది ఈ సంబంధం ఉంది అని తామే మంతనాలు సాగిస్తూ ఉన్నారు. కాని వీరకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. బాగా చదువుకోవాలని ఉంది. కూతురు బాగా చదువుకుని తన కాళ్ల మీద తాను నిలబడి తన జీవితాన్ని తాను నిర్మించుకునే శక్తి పొందాలని సోనమ్‌కు గట్టిగా ఉంది. కాని ఆ మాట ఆ తల్లికూతుళ్లు ఇద్దరూ చెప్పే వీలు ఆ ఇంట్లో లేదు. భర్తకు చెప్తే అర్థం కాదు.అరె... నా కూతురు విషయంలో కూడా నాకు స్వేచ్ఛ లేదా అని సోనమ్ అనుకుంది.అంతే. తనలో తాను ముడుచుకుపోవడం మొదలుపెట్టింది. లోలోపలికి పూర్తిగా చీకట్లోకి వెళ్లిపోయింది. ఆమెకిప్పుడు లోకవ్యవహారాల వేటి మీదా ఆసక్తి లేదు. ఆమె కేవలం ముక్కు నుంచి గాలి పీల్చి వదలగల ఒక బొమ్మ మాత్రమే. సైకియాట్రిస్ట్‌కు అంతా అర్థమైంది. కుటుంబాన్ని కూచోబెట్టుకుని చెప్పింది.‘చూడండి. మనుషులు కలిసి ఉండటం ఎప్పుడూ బాగుంటుంది. కాని కలిసి ఉండటం అంటే కాళ్లకు సంకెళ్లు కట్టి ఉంచడం కాదు. ఎదుటివారి కలలు, కోరికలు, అభిప్రాయాలు వీటిని పట్టించుకుని వాటిని ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడమే ఉమ్మడి కుటుంబం ఉద్దేశ్యం. కాని ఒకరిపై మరొకరు పెత్తనం చేయడం అణచి ఉంచడం ఎంత మాత్రం కాదు. మీరు ఇంట్లో మీ చిన్న కోడలుకు గది ఇచ్చారు కాని సమాజంలో భాగమవడానికి గడప ఇవ్వలేదు. అయినా ఆమె భరించింది. కాని ఆమె కూతురికి కూడా అదే పరిస్థితి వచ్చే సరికి శిథిలమయ్యింది. ‘ఇది నువ్వు చెయ్’ అనే మాటను మీ ఇంట్లో మానేయండి. ‘ఏం చేయాలనుకుంటున్నావు’ అని అడగడం నేర్చుకోండి. ఎదుటివారి ఇష్టాలను హేళన చేయకుండా గౌరవించే స్థితికి మీరంతా ఎదిగినప్పుడే మీ ఉమ్మడి కుటుంబం ఇంకా అర్థవంతంగా ఉంటుంది. మీ మనవరాలి పెళ్లి మీద మొదట నిర్ణయం తీసుకోవాల్సింది మీ మనవరాలే. తర్వాత ఆమె తల్లి. మీరు మాత్రం కాదు’ అని వారికి వివరించి చెప్పింది.అత్తగారు, తోడికోడళ్లు సోనమ్‌ను, వీరను అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు.వాళ్లు మొదట చేసిన పని పెళ్లి ప్రస్తావన వాయిదా వేయడం.వీర ఏం చదువుకోవాలన్నా సపోర్ట్ చేస్తామని సోనమ్‌కు వారు ధైర్యం చెప్పారు.అసలు ఒక వారం రోజుల సంతోషంగా తిరిగి రండి అని టికెట్లు బుక్ చేసి టూర్‌కు కూడా పంపారు. కిచెన్ రూల్స్ మారాయి. ఎవరికి ఏం కావాలన్నా సంకోచం లేకుండా వండుకోవాలని అత్తగారు ప్రకటన చేసింది. ఎవరి నిర్ణయాలకు అడ్డు చెప్పేది ఉండదని కాకుంటే మంచి చెడ్డలు ఆలోచించడానికి ఒక అవకాశం పెద్దలకు ఇవ్వదలిస్తే ఇవ్వండని మామగారు చెప్పారు.చిన్న చిన్న కిటికీ రెక్కలు కూడా విప్పినప్పుడు పెద్ద వెలుతురు తెస్తాయి.ఇంట్లో సోనమ్ ఇప్పుడు కూడా చిన్నకోడలే.కాని ఆ ఇద్దరు పెద్ద కోడళ్లకంటే కూడా హోదాలో తక్కువ కాదు. అధికారంలో తక్కువ కాదు. ఇటీవల కూతురిని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చి వచ్చాక ఉదయాన్నే లేచి ఉత్సాహంగా పనిలో పడ్డ సోనమ్‌ను ఆ రెండంతస్తుల ఇంట్లో అందరూ తృప్తిగా చూశారు. కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్ -
సిటీ పోలీసు వెబ్‌సైట్స్ రికార్డ్ బ్రేక్!
సాక్షి, సిటీబ్యూరో: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్న నగర పోలీసులు మరో అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నారు. దేశంలోని వివిధ పోలీసు విభాగాలకు సంబంధించిన ఫేస్బుక్ పేజీలకు ఉన్న జనాదరణ, ప్రాచుర్యాన్ని ఇటీవల ఫేస్బుక్ సంస్థ అధికారికంగా లెక్కించింది. ఈ నేపథ్యంలో నగర ట్రాఫిక్ విభాగానికి చెందిన ‘హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పేజ్’ రెండో స్థానంలో, పోలీసు విభాగానికి చెందిన ‘హైదరాబాద్ సిటీ పోలీసు పేజ్’ నాలుగో స్థానంలో ఉన్నట్లు తేలింది. ఈ మేరకు ఫేస్బుక్ ఇటీవల పోలీసు విభాగానికి వర్తమానం సైతం పంపింది. ఏడేళ్ల క్రితం అందుబాటులోకి... నగర పోలీసు విభాగంతో పాటు ట్రాఫిక్ వింగ్స్ 2011 నుంచి అందుబాటులోకి వచ్చాయి. నగర ట్రాఫిక్ పోలీసులు సమస్యలను చక్కదిద్దడానికి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్‌ను వినియోగించాలని అప్పట్లో ఉన్నతాధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా ట్రాఫిక్ పోలీసు ఫేస్‌బుక్‌కు రూపకల్పన జరిగింది. అప్పటి వరకు దేశంలో కేవలం ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, పుణే, చండీఘడ్‌లో మాత్రమే ట్రాఫిక్ ఫేస్బుక్ పేజ్‌లు ఉండేవి. వాటి తర్వాత హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఆ ఏడాది జూన్ నాటికి సిటీ ట్రాఫిక్ ఫేస్బుక్లో కేవలం 2500 మంది నెటిజన్లు మాత్రమే లైక్ చేసి సభ్యులుగా చేరారు. ఏడేళ్ల కాలంలో వీరి సంఖ్య 3.13 లక్షలకు చేరడంతో ఇది రెండో స్థానాన్ని, పోలీసు ఫేస్బుక్ పేజ్‌ను ఇప్పటి వరకు 2.12 లక్షల మంది లైక్ చేయడంతో నాలుగో స్థానాన్ని ఆక్రమించాయి. ప్రజలకు ఉపయుక్తంగా... ఈ రెండు ఫేస్బుక్ పేజీలను పోలీసు విభాగం ప్రజలకు ఉపయుక్తంగా మారుస్తూ వస్తోంది. నేరాల నియంత్రణపై అప్రమత్తత, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఈ పేజ్‌ను వినియోగిస్తున్నారు. సిబ్బంది, అధికారులకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఇచ్చే ఆస్కారం కల్పించారు. అలాగే ట్రాఫిక్ పేజ్‌ను ఉల్లంఘనుల గుర్తింపు, ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తూ ప్రత్యేకంగా రూపొందించారు. దీంతో ప్రజల భాగస్వామ్యం పెరిగి లైక్ చేస్తున్న వారిసంఖ్య లక్షలకు చేరింది. ఇందులో ప్రజలు వ్యక్తం చేస్తున్న సందేహాలు, వస్తున్న ఫిర్యాదులనూ అధ్యయనం చేస్తున్న ఐటీ వింగ్స్ అధికారులు ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తున్నారు. అన్నింటికీ..... ఈ ఫేస్బుక్ పేజ్‌ల్లో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ అలర్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు అన్ని రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలు, నేరాలపై అధికారులకు ఫిర్యాదు/సమాచారం అందజేయవచ్చు. ప్రతి పౌరుడు తన దృష్టికి వచ్చిన ట్రాఫిక్ ఉల్లంఘన, నేరాన్ని ఫొటో తీసి, అది జరిగిన ప్రదేశం, సమయం తదితరాలను పొందుపరుస్తూ ఇందులో పోస్ట్ చేయవచ్చు. ప్రధానంగా పోలీసు అధికారుల ఉల్లంఘనలపై నిత్యం అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. వీటి ఆధారంగా దాదాపు 60 మంది పోలీసులపై చర్యలు సైతం తీసుకున్నారు. నగర పోలీసు పేజ్ ద్వారానూ ఇలాంటి అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ రెండు పేజ్‌లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాలు 24 గంటలూ పని చేస్తున్నాయి. మూడూ కలిస్తే మనమే టాప్... దేశంలోని అన్ని పోలీసు విభాగాలకు చెందిన ఫేస్బుక్ పేజ్‌లు అధ్యయనం చేయగా, బెంగళూరు ట్రాఫిక్ పేజ్ తొలిస్థానంలో నిలిచింది. అక్కడ ఐటీ జోన్ ఎక్కువ కావడంతో పాటు ఒకే కమిషనరేట్ ఉండటంతోనే ఇది సా«ధ్యమైందని నగర అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ పరిధి మూడు కమిషనరేట్లుగా మారడంతో పాటు ఐటీ జోన్ మొత్తం శివార్లలో ఉండటంటో సిటీ సైట్స్ లైక్స్ తగ్గాయని వ్యాఖ్యానిస్తున్నారు. అయినా ఇవి 2, 4 స్థానాల్లో ఉన్నాయని...మూడు కమిషనరేట్లనూ ఒకే యూనిట్‌గా పరిగణిస్తే ప్రథమ స్థానంలో ఉండటంతో పాటు కొత్త రికార్డు నెలకొల్పడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ప్రజలతో మమేకం కావడం, ఫేస్బుక్ పేజ్‌ల ద్వారా వారు ఇస్తున్న ఫిర్యాదులు, సూచనలు, సలహాలపై స్పందించడమే ఇందుకు కారణంగా పేర్కొన్నారు. ఫేస్బుక్ సంస్థ లెక్కల ప్రకారంఇవీ టాప్ సిక్స్... ఫేస్బుక్ పేజ్ లైక్స్ బెంగళూరు ట్రాఫిక్ 4.95 లక్షలు హైదరాబాద్ ట్రాఫిక్ 3.13 లక్షలు ఢిల్లీ ట్రాఫిక్ 2.61 లక్షలు హైదరాబాద్ సిటీ 2.12 లక్షలు కోల్‌కతా ట్రాఫిక్ 1.79 లక్షలు సైబరాబాద్ ట్రాఫిక్ 41.3 వేలు -
మాలోకం వేరు
గుంటూరు(ఎస్వీఎన్ కాలనీ): డక్ స్మైల్‌తో సోషల్ మీడియా ఫేస్బుక్లో పోస్టు పెట్టింది ఓ యువతి. వెంటనే హాయ్, యుఆర్ లుకింగ్ సో క్యూట్ అంటూ ఓ రిప్లై మెసేజ్. తరువాత లైకుల మీద లైకులు. ఫేవరబుల్ కామెంట్లు. ఇంకేముంది, కాసేపలా లోలోపల ఉబ్బితబ్బిబైపోయి. ధ్యాంక్యూ అటూ రిప్లై, అలా మొదలైన పరిచయం ఏ కాఫీ షాపులో మీట్ అయ్యేందుకో ఒకే అనిపిస్తుంది. అవును ఆన్లైన్ పరిచయాలు ఆన్లైన్ చాటింగ్‌తోనే ఆగిపోవట్లేదు. నేరుగా కలిసే వరకూ వెళ్తున్నాయి. అటు నుంచి మరో సంఘటలకు దారి తీస్తున్నాయి. నిండా పదహారేళ్లు కూడా లేని పిల్లలు సైతం ఇలాంటి పరిచయాలు వైపు మొగ్గు చూపడం ఇపుడు తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్న విషయం. ఇంటెల్ సెక్యూరిటీ, నాస్కామ్ పలు పట్టణాల్లో నిర్వహించిన టీన్స్ ట్వీన్స్ అండ్ టెక్నాలజీ స్టడీలో ఇలాంటి ఆసక్తికరమైన విషయాలెన్నో వెలుగుచూశాయి. 8–14 ఏళ్లలోపు చిన్నారులు ఫేస్బుక్లో అకౌంట్ నిర్వహిస్తున్నారంటే యువతరం సోషల్ మీడియాకు ఎంతగా ఎడిక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఆన్లైన్ పరిచయాలు.. 19 ఏళ్లలోపు చిన్నారులు సోషల్ మీడియా వినియోగించకూడదే నిబంధనలున్నా ఎవరూ ఖాతరు చేయడం లేదు. సోషల్ మీడియాలో 8 నుంచి 18 ఏళ్లలోపు బాలబాలికలు యాక్టివ్ కనిపిస్తున్నారు. 37 శాతం మందికిపైగా ఆన్లైన్లో పరిచయమైన వ్యక్తుల్ని నేరుగా కలుసుకుంటున్నట్లు ఇంటెల్ సెక్యూరిటీ స్టడీలో వెల్లడైంది. అంతేకాదు.. 57 శాతం మంది తెలిసీతెలియనితనంతో తమ వ్యక్తిగత విషయాలనే కాదు. కుటుంబ, ఆర్థిక వ్యవహారాల వివరాలను సైతం సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేస్తున్నారు. దీన్ని కొందరు క్యాష్ చేసుకుంటూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. గుంటూరులోని ఒక పేరొందిన పాఠశాలలో ఉన్నత వర్గానికి చెందిన ఒక బాలిక ఇదే తరహా మోసానికి గురకావడం ఇందుకు నిదర్శనం. గుంటూరు, విజయవాడ నగరాల్లో ఇలా 72 శాతం మేరకు 8–15 ఏళ్లలోపు పిల్లలు ఆన్లైన్లో యాక్టివ్‌గా వ్యవహరిస్తున్నారు. 16–18 ఏళ్లలోపు యువత 20 శాతం చాటింగ్లకు సమయం కేటాయిస్తున్నారు. 19– 21 ఏళ్ల వరకు 8 శాతం మందిమాత్రమే ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ఉంటున్నారు. వీరందరూ రోజులో 2 నుంచి 4 గంటలపాటు నెట్‌తోనే గడిపేస్తున్నారు. మొత్తంగా 8–21 ఏళ్ల వయసు వారిలో 68 శాతం మంది ఫేస్బుక్ అకౌంట్లు కలిగి ఉన్నారని అధ్యయనం చెబుతోంది. సామాజిక మాధ్యమాల్లో 57 శాతం మంది పిల్లలు వ్యక్తిగత సమాచారంతోపాటు, ఫోన్ నంబర్లు పొందుపరుస్తున్నారు. 35 శాతం మంది పిల్లలు ఆన్లైన్లో పరిచయమైన అపరిచితుల్ని వ్యక్తిగతంగా కలుస్తున్నారు. 55 శాతం మంది పిల్లలు తమ ఆన్లైన్ కార్యకలాపాలను తల్లిదండ్రుల కంటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. 19 శాతం మంది పిల్లలకు కుటుంబసభ్యులతోపాటు, స్నేహితుల, ఇతరుల పాస్వర్డ్లు తెలుసు. వారిలో 68 శాతం మంది ఇతరుల అకౌంట్లను తెరుస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉన్న పిల్లల్లో 22 శాతం మంది సైబర్ వేధింపులకు గురయ్యారు. ఇందులో ఎక్కువగా ఆడపిల్లలే ఉంటున్నారని తెలుస్తోంది. 51 శాతం మంది పిల్లలు ఇతరుల పాస్వర్డ్లు తెలుసుకుంటున్నారు. తల్లిదండ్రులు 70 శాతం మంది తల్లిదండ్రులు సోషల్ మీడియా పిల్లలపై దుష్ప్రభావాలు చూపుతోందని ఆందోళన చెందుతున్నారు. 88 శాతం మంది తల్లిదండ్రులు పిల్లల ఆన్లైన్ యాక్టివిటీ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కనబరుస్తున్నారు. యువతలో అధికంగా 25 శాతం మంది అపరిచితులతో సంభాషణ చేస్తున్నారని, 16 శాతం వ్యక్తిగత వివరాల వెల్లడిస్తున్నారని, 14 శాతం ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌కు గురయ్యారని, 12 శాతం సైబర్ బబ్లింగ్‌తో సతమతమయ్యారని అధ్యయనాలు తేటతెల్లం చేస్తున్నాయి. బ్రౌజింగ్ వివరాలు కనిపించకుండా.. ఇంటర్నెట్ బ్రౌజింగ్ హిస్టరీని, వాట్సాప్, మెసెంజర్ చాటింగ్ డిటైల్స్‌ని తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. కాగా తల్లిదండ్రులు తరచుగా వ్యక్తిగత వివరాల తస్కరణ, ప్రైవసీ సెట్టింగ్స్, సైబర్ బబ్లింగ్, ఆన్లైన్ గుర్తింపు వంటి విషయాలపై పిల్లలతో చర్చిస్తుండడం గమనార్హం. 4.4 శాతం బాలలు పాస్‌వర్డ్‌లను తల్లిదండ్రులతో పంచుకుంటున్నారు. వేధింపుల కారణంగా 51 శాతం పిల్లలు ఇతరులను సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తున్నారు. 78 శాతం తల్లిదండ్రులు పిల్లల ఆన్లైన్ వినియోగాన్ని నియంత్రింగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతికూలతలు ఫేస్బుక్, టెలిగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్, ఐఎంవో వీడియో కాలింగ్, ఆన్లైన్ షేర్, గూగుల్ ప్లస్ వంటి సామాజిక మాధ్యమాలు వ్యక్తులు, సమూహాల మధ్య సమాచార మార్పిడికి ఉద్దేశించినవే. ప్రస్తుతం వీటితో మేలు కంటే దష్ఫ్రరిణామాలే అధికంగా తొంగి చూస్తున్నాయి. నిన్నమొన్నటి వరకు పాఠశాల స్థాయి విద్యార్థులు ఇంటికి రాగానే టీవీలో కార్టూన్ కార్యక్రమాలకు అతుక్కుపోయేవారు. కానీ ఇప్పుడు అరచేతిలో ప్రపంచాన్ని చూపుతున్న పీసీలు, ఇంటర్నెట్లకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అప్లోడ్, డౌన్లోడ్లతో కాలం గడిపేస్తున్నారు. ఇంటెల్ సెక్యూరిటీ చేసిన సర్వేలో నగరంలో 72 శాతం మంది 8–18 ఏళ్లలోపు పిల్లలు ఆన్లైన్లో చురుకుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. పిల్లలు సోషల్ మీడియాలో తమ వ్యక్తిగత సమాచారాన్ని (ఫోటోలు, ఫోన్ నంబర్లు వంటివి) పొందు పరుస్తున్నారు. పిల్లలపై తీవ్ర ప్రభావం సెల్ఫోన్లో సోషల్ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. నిండా పదేళ్లు కూడా నిండని చిన్నారులు సోషల్నెట్ వర్క్‌లతో బిజీ అవుతున్నారు. ఇది ఒకింత విజ్ఞాన ప్రపంచాన్ని చేరువ చేస్తున్నట్లు కనిపిస్తున్నా చిన్నారుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. పిల్లలను ఇతర వ్యాపకాల వైపు మళ్లిస్తే అన్లైన్ దుష్ప్రభావాల నుంచి కాపాడుకోవచ్చు. – ఎన్ రాజ్యలక్ష్మి, మనస్తత్వ నిపుణులు, చేతన మనో వికాస కేంద్రం -
Aish ఆ పది ఇష్టాలు
ఐశ్వర్యా రాయ్‌కి ఏ రంగు ఇష్టం? ఇప్పటివరకూ చదివిన పుస్తకాల్లో ఐష్ పదే పదే చదివిన పుస్తకం ఏది? ఆమె ఇష్టపడే పర్ఫ్యూమ్ ఏంటి?.. ఇలా ఐష్ ఇష్టాలు తెలుసుకోవాలని ఆమె అభిమానులకు ఉంటుంది. వారి కోసం కొన్ని ఇష్టాలు... ►ఐశ్వర్యా రాయ్‌కి చేతి గడియారాలంటే చెప్పలేనంత ఇష్టం. కొత్త కొత్త వాచ్‌లు కొని,వెతికి పెట్టుకుని మురిసిపోతుంటారు. ఇప్పటివరకూ కొనుక్కున్న వాచ్‌లను భద్రంగా దాచుకున్నారు. వీలు కుదిరినప్పుడల్లా అల్మరాలోంచి వాటిని తీసి, చూసుకుంటారు. అలాగే, డ్రెస్‌కి నప్పే వాచ్‌ని సెలక్ట్ చేసుకుంటారు. ►నలుపు, నీలం, తెలుపు రంగులంటే ఐష్‌కి చాలా ఇష్టం. ఏ డ్రెస్ కొనుక్కున్నా వీటిలో ఏదో ఒక రంగు ఉండేలా చూసుకుంటారు. లేకపోతే వీటిలో ఒకే రంగు ఉన్న డ్రెస్‌ని ఎంపిక చేసుకుంటారట. ఒకవేళ ఈ రంగుల్లో నచ్చిన డిజైనర్ వేర్ లేకపోతే అప్పుడు వేరే కలర్స్‌కి వెళతారట. ►{పముఖ రచయిత పాలో కొయిలో రాసిన పుస్తకాలకు ఐష్ వీరాభిమాని. ముఖ్యంగా ఆయన రాసిన వాటిలో ‘ఆల్కెమిస్ట్’ పుస్తకం అంటే ఆమెకు ఇష్టం. ఆ పుస్తకాన్ని లెక్కలేనన్నిసార్లు చదివారు. ►చీరలు, పొడవాటి గౌన్లు, చుడీదార్లు అంటే అందాల సుందరికి ఇష్టం. ఆమె వార్డ్‌రోబ్‌లో ఎక్కువగా ఉండేవి ఇవే. సింపుల్‌గా, హుందాగా ఉండే డిజైనర్ వేర్ శారీస్ని ఇష్టపడి కట్టుకుంటారామె. ►నటీనటుల్లో నర్గిస్, రాజ్‌కపూర్, అమితాబ్ బచ్చన్ అంటే ఐష్‌కి అభిమానం. నర్గిస్ని ఆదర్శంగా తీసుకుంటానని పలు సందర్భాల్లో ఐష్ పేర్కొన్నారు. ►చైనీస్, థాయ్ ఫుడ్ అంటే ఐష్‌కి చాలా ప్రీతి. ఈ వంటకాలు ఆరగిస్తున్నప్పుడు డైట్ గురించి కూడా మర్చిపోతారట. ►ఎప్పుడైనా బాగా అలసటగా అనిపిస్తే, బాడీ మసాజ్ చేయించుకుని, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం ఐష్‌కి ఇష్టం. ఆ తర్వాత ఒళ్లెరగకుండా నిద్రపోతారట. మర్నాడు ఉదయం లేవగానే అద్దంలో మొహం చూసుకున్నప్పుడు కనిపించే ఓ కొత్త మెరుపంటే ఐష్‌కి ఇష్టం. ►వీలైనంత శుభ్రంగా ఉండాలనుకుంటారు. అలాగే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటారు. ►పండగలప్పుడు షూటింగ్స్ ఉండకూడదని కోరుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి పండగ చేసుకోవడం ఐష్‌కి చాలా ఇష్టం. అలాగే, ఆ రోజు అందరికీ మిఠాయిలు పంచి, ఆనందిస్తారట. ►ఫేవరెట్ హాలిడే స్పాట్ ఫ్రాన్స్. అక్కడ ‘వైన్ ఫేషియల్’ చేస్తారని తెలిసి, ఓసారి చేయించుకున్నారట. ఆ ఫేషియల్ తెగ నచ్చేసిందని ఓ సందర్భంలో ఐష్ పేర్కొన్నారు. అందుకే ఫ్రాన్స్ వెళితే చాలు వైన్ ఫేషియల్ చేయించుకోకుండా ఇండియా రారట! -
అవంటే అయిష్టం
ప్లాస్టిక్ నవ్వులు, పైపై మెరుగులంటే అనుష్కా శర్మకు అయిష్టం. మనస్ఫూర్తిగా మాట్లాడటం.. మనసులో అనిపించింది ఓపెన్‌గా చెప్పేయడం ఇష్టం. ఇంకా ఈ బ్యూటీకి బోల్డన్ని ‘ఇష్టాయిష్టాలు’ ఉన్నాయి. అవేంటో సరదాగా తెలుసుకుందాం... ఇష్టాలు ♦ పుస్తకాలంటే ప్రాణం. ఫ్రెండ్స్ సరదాగా ‘పుస్తకాల పురుగు’ అని పిలుస్తుంటారు. ఆ పుస్తకం ఈ పుస్తకం అని కాదు.. చేతికి దొరికిందల్లా చదివేస్తారు. షూటింగ్లో షాట్ గ్యాప్‌లో ఏదో ఒక బుక్ చదువుతుంటారు. ♦ రొయ్యలు, చేపలు ఎలా వండినా ఇష్టపడేవారు. చికెన్ కర్రీ విత్ బటర్ అంటే చాలా ప్రీతి. కానీ, కొన్ని నెలల క్రితం మాంసాహారం మానేశారు. ఇప్పుడు కూరగాయలను ఇష్టపడుతున్నారు. ♦ నలుపు రంగంటే చాలా ఇష్టం. వార్డ్ రోబ్‌లో ఆ రంగు డ్రెస్‌లే ఎక్కువ. ♦ సినిమాల్లో పాటలకు డ్యాన్స్ చేయడం కామన్. కానీ, విడిగా కూడా ఖాళీ దొరికినప్పుడల్లా డ్యాన్స్ చేస్తుంటారు. ఎందుకంటే డ్యాన్స్ అంటే అనుష్కకు చాలా ఇష్టం. ♦ ఒక్కరోజు యోగా చేయకపోయినా ఏదో వెలితిగా ఉన్నట్లు ఫీలైపోతారు. యోగా అంటే బోల్డంత లైకింగ్ మరి. ♦ ముక్కుసూటిగా వ్యవహరించడం ఇష్టం. ♦ ఇంటి నుంచి బయటికెళ్లేటప్పుడు హ్యాండ్ బ్యాగ్‌లో ఏది ఉన్నా లేకపోయినా ‘ప్రోటీన్ బార్స్’ ఉండేలా చూసుకుంటారు. ఆరోగ్యానికి మేలు చేస్తాయి కాబట్టి, అవంటే చాలా ఇష్టం. ♦ అందమైన జుత్తంటే అనుష్కకు ఇష్టం. హెయిర్ కేర్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. షాంపూలు, కండిషనర్లు, హెయిర్ మాస్కులు కొంటుంటారు. షూలంటే బోల్డంత ఇష్టం. లెక్కలేనన్ని ఉన్నాయి. ♦ జపనీస్, ఇటాలియన్ వంటకాలంటే వల్లమాలిన ఇష్టం. ఎంత తిన్నా బరువు పెరగరు. అది తన అదృష్టం అంటారు అనుష్క. ♦ స్వేచ్ఛగా బతకాలనుకుంటారు. తనకు నచ్చినట్లుగా ఇల్లు కొనుక్కున్నారు. అభిరుచికి తగ్గట్టుగా ఆ ఇంటిని డిజైన్ చేయించుకున్నారు. ఆ ఇంట్లో ఒంటరిగా ఉండటం ఇష్టం. అయిష్టాలు ♦ స్మోకింగ్ అంటే అనుష్కా శర్మకు పరమ అసహ్యం. ఎవరైనా సిగరెట్ తాగుతూ కనిపిస్తే చెడామడా తిట్టాలనిపిస్తుందట. ♦ డబ్బుకి ప్రాధాన్యం ఇచ్చేవాళ్లంటే ఇష్టం ఉండదు. స్టేటస్ చూసి ఫ్రెండ్షిప్ చేసేవాళ్లను ఆమడ దూరంగా ఉంచేస్తారు. ♦ బిజీ బిజీగా షూటింగ్స్ చేయడం నచ్చదు. షూటింగ్ లొకేషన్లో ఎవరైనా అనవసరంగా హైరానా పడుతుంటే ‘కూల్ బాసూ’ అంటారు. ♦ గాసిప్పురాయుళ్లంటే అస్సలు ఇష్టం ఉండదు. విరాట్ గురించి, తన గురించి వార్తలు ప్రచారం చేసేవాళ్లు కంటికి కనిపిస్తే రఫ్ఫాడేయాలనేంత కోపం. ♦ అనుష్కా శర్మ అతిగా అసహ్యించుకునేవాటిలో ‘నైట్ షూటింగ్’ ఒకటి. నైట్ షూట్స్ చేసినప్పుడు చాలా డిస్ట్రబ్ అయిపోతారు. ♦ ‘మీ పెళ్లెప్పుడు’ అని ఎవరైనా అడిగితే, చెంప చెళ్లుమనిపించేంత కోపం వస్తుంది. విలేకరుల నుంచి ఆ ప్రశ్న వినకూడదనుకుంటారు. ♦ నర్మగర్భంగా వ్యవహరించేవాళ్లంటే ఇష్టం ఉండదు. అలాంటివాళ్లను వీలైనంత దూరంగా ఉంచుతారు. ♦ చాక్లెట్స్, కాఫీ, నెయిల్ ఆర్ట్ (గోరు మీద వేసే డిజైన్) వంటివాటిని ఇష్టపడరు. ♦ ఆడవాళ్లు అబలలు అనే మాట వినడానికి ఇష్టపడరు. అలా ఎవరైనా అంటే, వాళ్లకి ఓ రేంజ్లో క్లాస్ తీసుకుంటారు. ♦ ప్లాస్టిక్ నవ్వులు నవ్వడం చేతకాదు. అలా నవ్వేవాళ్లంటే అయిష్టం. -
అతుక్కుపోతే అంతే
- అంతర్జాలంతో నిండా ప్రయోజనాలే - మితిమీరితే అదో విష వలయం - లైక్స్, కామెంట్స్ కోసం పరితపిస్తే మానసిక సమస్యలు తప్పవ్ ఏలూరు సిటీ/ఏలూరు (వన్‌టౌన్)/ఏలూరు (బిర్లాభవన్ సెంటర్) : ‘వాట్ బ్రో. ఎఫ్బీలో పోస్టింగ్ చూశా. అదిరిందిలే..’ ఫేస్బుక్లో మిత్రుడి నుంచి వచ్చిన కామెంట్ ఇది. ఆ మరుక్షణమే ‘ఎస్ డ్యూడ్. మూడురోజుల టూర్‌ను ఎంజాయ్ చేశా’నంటూ అటువైపు నుంచి సమాధానం. ‘ఏంట్రా.. ఈ మధ్య బయటకు రావడం మానేశావ్’ అని అడిగితే.. ‘ఆ.. ఏముంది వీడెప్పుడూ సోషల్ మీడియూలోనే మునిగి తేలుతున్నాడ’ంటూ సెటైర్లూ వినిపిస్తున్నారు. ఏ సమాచారం పంచుకోవాలన్నా వాట్స్ యాప్, ట్విట్టర్, ఫేస్బుక్, వుయ్‌చాట్ ఇలా ఏదో దానిలో కలుద్దామనే ధ్యాసలోనే ఉంటోంది యువత. ఫేస్బుక్లో కామెంట్లు, లైక్‌లు, పోస్టింగ్‌లతో రోజులో సగానికిపైగా కాలాన్ని వెచ్చించే పరిస్థితులు వచ్చాయి. ప్రతి చిన్న పనినీ సోషల్ మీడియాలో చూపించేందుకే యువత తాపత్రయపడుతోంది. తమ పిల్లలు చాటింగ్‌లు చేస్తుంటే అదేమిటో తెలియక.. ఇబ్బందులు పడతారనే ఆందోళనతో సతమతమవుతున్నారు వారి తల్లిదండ్రులు. ఈ పరిస్థితులపై నేటి యువత, నిపుణులు ఏమంటున్నారంటే... జాగ్రత్తలు పాటించాలి సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎక్కువగా ఉందనే చెప్పాలి. ప్రొఫెషనల్ కోర్సులు చేసే విద్యార్థులకు ఇంటర్నెట్తో చాలా ఉపయోగం ఉంది. స్టడీ మెటీరియల్ కావాలన్నా.. తెలియని విషయాలు తెలుసుకోవాలన్నా ఇంటర్నెట్ వినియోగించాలి. కానీ సోషల్ మీడియా వినియోగించే వారు జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. లేకుంటే సమస్యలు తప్పవు. - కల్యాణి, స్టూడెంట్ వ్యసనం కాకూడదు సోషల్ మీడియాను వినోదం కోసం వినియోగించటంలో తప్పులేదు. నేడు ఎక్కువమంది ఎక్కువ సమయం సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. అవసరం ఉన్నంత మేరకే ఉపయోగిస్తే ఏ విధమైన సమస్యా ఉండదు. చాలామందికి సోషల్ మీడియా వ్యసనంలా మారింది. అది వారికి, వారి కుటుంబానికి, సమాజానికి కూడా మంచిది కాదు. - శ్రావణ జ్యోతి, స్టూడెంట్ యువతులకు ఇబ్బందులు సోషల్ మీడియా పెడదారి పట్టడం కారణంగా యువతులు నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి. విద్య, సమాచారం కోసం మాత్రమే ఇంటర్నెట్ను వినియోగిస్తే మంచిది. పరిమితులు లేకుండా సోషల్ మీడియాలో చొచ్చుకుపోతే యువతులకు ఇబ్బందులు తప్పవు. మితిమీరి దేనినీ వినియోగించకూడదు. మంచి విషయాలపై ఎప్పుడూ స్పందించాలి. - వల్లి, స్టూడెంట్ అవసరం మేరకు ఉపయోగించుకోవాలి బంధువులు, స్నేహితులు దూరంగా ఉన్నారనే భావన ఉండకుండా ఎఫ్బీ, వాట్స్‌యాప్ ఉపయోగపడుతున్నాయి. అయితే సోషల్ మీడియాను అవసరానికి మించి వాడటం కూడా తప్పే. మనకు అందివచ్చిన అవకాశాలను అవసరం మేరకు మాత్రమే ఉపయోగించుకుంటే లాభం ఉంటుంది. - బి.పూజిత, స్టూడెంట్ వరంగా భావించాలి కానీ.. పూర్వ ఒక సమాచారాన్ని చేరవేయాలంటే ఎన్నో రోజులు పట్టేది. ఇతర దేశాల్లోని బంధువులు ఎలా ఉన్నారో తెలుసుకోవాలన్నా చాలా కష్టంగా ఉండేది. చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానంతో సోషల్ మీడియా అందుబాటులోకి రావటం వరంలా భావించాలి. కానీ.. అవసరం మేరకే వినియోగించుకోవలి. - వై.రామన్, స్టూడెంట్ మంచిచెడుల కలయిక సమాజంలో మంచి, చెడూ రెండూ ఉంటాయి. యువత మంచిని తీసుకుని చెడును విస్మరిస్తే బాగుంటుంది. తల్లి.. తండ్రి.. గురువు.. దైవం ఇలా పూర్వీకులు పాటించిన సంప్రదాయాలను అనుసరిస్తే ఏదిచేసినా మంచిదే. సోషల్ మీడియాతో చెడు ఉన్నా.. మంచి చాలానే ఉంది. అందుకే యువత సోషల్ మీడియాను మంచికే వినియోగించాలని నా సూచన. - వారణాశి సౌమ్య, స్టూడెంట్ సెల్ఫ్ కంట్రోల్ తప్పుతుంది నేటి యువత ఇంటర్నెట్ను అధికంగా వినియోగిస్తోంది. ఎక్కువ సమయూన్ని చాటింగ్, పోస్టింగ్స్తోనే గడపటం వల్ల యువతో ఆత్మ నిగ్రహం (సెల్ఫ్ కంట్రోల్) తప్పుతోంది. విలువైన సమయం వృథా అవుతోంది. ఇంటర్నెట్ను మితిమీరి వాడటం వల్ల సహజంగానే చికాకు, ఆగ్రహం కలుగుతారుు. క్రోధం పెరిగిపోతుంది. ఇంట్లో తల్లిదండ్రుల్ని, తరగతి గదుల్లో ఉపాధ్యాయులు, అధ్యాపకులను లక్ష్యపెట్టే పరిస్థితి ఉండటం లేదు. అవసరం లేని విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన వాటిని తేలిగ్గా తీసుకోవటం చేస్తున్నారు. తప్పొప్పులు తెలియని 13నుంచి 19 ఏళ్ల వయస్కుల జీవితాలపై జీవితాలపై చెడు ప్రభావం చూపుతోంది. పరీక్షల్లో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆత్మహత్యలూ పెరిగిపోతున్నాయి. - డాక్టర్ సీహెచ్ వంశీకృష్ణ, మానసిక వైద్య నిపుణులు మెదడు, నరాలపై తీవ్ర ప్రభావం కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్ఫోన్ల వినియోగంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. వాటినుంచే వచ్చే కిరణాలు కంటిచూపుపై ప్రభావం చూపిస్తాయి. పైగా ఎక్కువ సమయం వాటిపై దృష్టి కేంద్రీకరించటం వల్ల మెదడుపై దుష్ర్పభావం పడుతుంది. మెదడు మొద్దుబారే ప్రమాదమూ ఉంది. సోషల్ మీడియాకు బానిసలుగా మారటంతో చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. అందువల్ల యువతే కాదు ఎవరైనా సరే ఇంటర్నెట్కు అతుక్కుపోకుండా అవసరం మేరకే వినియోగించడం మంచిది. - బోగరాజు ప్రసాద్, కంప్యూటర్ నిపుణులు ప్రమాదాలూ ఉంటాయి నెటిజన్ల విషయంలో చేసిన అధ్యయనాలను పరిశీలిస్తే.. మద్యం, మత్తు పదార్థాలకు బానిసలైన వారి తర్వాత స్థానంలో నెటిజన్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియా ఓ వ్యసనంలా మారిపోవటంతో యువత పెడదారిలో పయనిస్తోందనేది నిపుణులు అభిప్రాయం. మెదడు, నరాలకు సంబంధించిన వ్యాధులకు ఇదే కారణమవు తోంది. ఎఫ్బీ, ట్విట్టర్, మైస్పేస్, వాట్స్‌యాప్, వుయ్ చాట్ వంటి సోషల్ సైట్లలో 80శాతం మంది యువత బిజీగా ఉంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. సంఘవిద్రోహ శక్తులకూ ఈ సైట్లు ఆయుధాలుగా మారుతున్నాయి. కంప్యూటర్ కంటే ఎంతో శక్తివంతమైన మానవ మెదడు వీటి కారణంగా నిరుపయోగంగా మారి నిర్వీర్యం అయిపోతోంది. ఇక అశ్లీల సైట్ల ప్రభావంతో మహిళలు, యువతులపై అఘాయిత్యాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మానవ మేధస్సుకు ప్రతీకలుగా నిలుస్తున్న ఈ సాంకేతిక పరిజ్ఞానం వారినే బలి కోరుతుందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. -
వి LIKE షకీరా