పుష్ప-2 టీజర్‌.. ఆ సినిమాను దాటలేకపోయింది! | Allu arjun Pushpa 2 Teaser Not Break Tollywood Movie Salaar | Sakshi
Sakshi News home page

Pushpa 2 Teaser: పుష్ప-2 టీజర్‌.. సలార్‌ రికార్డ్ సేఫ్!

Published Tue, Apr 9 2024 3:26 PM | Last Updated on Tue, Apr 9 2024 4:19 PM

Allu arjun Pushpa 2 Teaser Not Break Tollywood Movie Salaar - Sakshi

ఐకాన్ స్టార్ పుష్ప-2 ది రూల్‌ చిత్రానికి ఉన్న  క్రేజ్ అంతా ఇంతా కాదు. టీజర్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు బర్త్‌ డే రోజే అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. పుష్ప-2 టీజర్‌ను పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేశారు. అయితే విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఒక్కసారిగా నంబర్‌వన్‌ ప్లేస్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. 

అయితే ఆ ఒక్క విషయంలో మాత్రం పుష్ప-2 రికార్డ్ బ్రేక్ చేయలేకపోయింది. ప్రభాస్‌ సలార్ మూవీ టీజర్‌ రికార్డ్‌ను అధిగమించలేకోపోయింది. సలార్‌ టీజర్‌ రిలీజైనప్పుడు కేవలం 6 గంటల 15 నిమిషాల్లో 1 మిలియన్‌ లైక్స్‌ వచ్చాయి. అదే  లైక్స్ పుష్ప-2 టీజర్‌కు రావడానికి 9 గంటల 59 నిమిషాలు పట్టింది. ఇక ఇదే జాబితాలో ఆర్ఆర్ఆర్ చిత్రం 36 గంటల 4 నిమిషాలతో మూడుస్థానంలో ఉంది. ఏదేమైనా యూట్యూబ్‌లో మాత్రం రికార్డ్ స్థాయి వ్యూస్‌తో దూసుకెళ్తోంది. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement