Aish ఆ పది ఇష్టాలు
ఐశ్వర్యా రాయ్‌కి ఏ రంగు ఇష్టం? ఇప్పటివరకూ చదివిన పుస్తకాల్లో ఐష్ పదే పదే చదివిన పుస్తకం ఏది? ఆమె ఇష్టపడే పర్‌ఫ్యూమ్ ఏంటి?.. ఇలా ఐష్ ఇష్టాలు తెలుసుకోవాలని ఆమె అభిమానులకు ఉంటుంది. వారి కోసం కొన్ని ఇష్టాలు...
►ఐశ్వర్యా రాయ్‌కి చేతి గడియారాలంటే చెప్పలేనంత ఇష్టం. కొత్త కొత్త వాచ్‌లు కొని,వెతికి పెట్టుకుని మురిసిపోతుంటారు. ఇప్పటివరకూ కొనుక్కున్న వాచ్‌లను భద్రంగా దాచుకున్నారు. వీలు కుదిరినప్పుడల్లా అల్మరాలోంచి వాటిని తీసి, చూసుకుంటారు. అలాగే, డ్రెస్‌కి నప్పే వాచ్‌ని సెలక్ట్ చేసుకుంటారు.
►నలుపు, నీలం, తెలుపు రంగులంటే ఐష్‌కి చాలా ఇష్టం. ఏ డ్రెస్ కొనుక్కున్నా వీటిలో ఏదో ఒక రంగు ఉండేలా చూసుకుంటారు. లేకపోతే వీటిలో ఒకే రంగు ఉన్న డ్రెస్‌ని ఎంపిక చేసుకుంటారట. ఒకవేళ ఈ రంగుల్లో నచ్చిన డిజైనర్ వేర్ లేకపోతే అప్పుడు వేరే కలర్స్‌కి వెళతారట.
►{పముఖ రచయిత పాలో కొయిలో రాసిన పుస్తకాలకు ఐష్ వీరాభిమాని. ముఖ్యంగా ఆయన రాసిన వాటిలో ‘ఆల్‌కెమిస్ట్’ పుస్తకం అంటే ఆమెకు ఇష్టం. ఆ పుస్తకాన్ని లెక్కలేనన్నిసార్లు చదివారు.
►చీరలు, పొడవాటి గౌన్లు, చుడీదార్లు అంటే అందాల సుందరికి ఇష్టం. ఆమె వార్డ్‌రోబ్‌లో ఎక్కువగా ఉండేవి ఇవే. సింపుల్‌గా, హుందాగా ఉండే డిజైనర్ వేర్ శారీస్‌ని ఇష్టపడి కట్టుకుంటారామె.
►నటీనటుల్లో నర్గిస్, రాజ్‌కపూర్, అమితాబ్ బచ్చన్ అంటే ఐష్‌కి అభిమానం. నర్గిస్‌ని ఆదర్శంగా తీసుకుంటానని పలు సందర్భాల్లో ఐష్ పేర్కొన్నారు.
►చైనీస్, థాయ్ ఫుడ్ అంటే ఐష్‌కి చాలా ప్రీతి. ఈ వంటకాలు ఆరగిస్తున్నప్పుడు డైట్ గురించి కూడా మర్చిపోతారట.
►ఎప్పుడైనా బాగా అలసటగా అనిపిస్తే, బాడీ మసాజ్ చేయించుకుని, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం ఐష్‌కి ఇష్టం. ఆ తర్వాత ఒళ్లెరగకుండా నిద్రపోతారట. మర్నాడు ఉదయం లేవగానే అద్దంలో మొహం చూసుకున్నప్పుడు కనిపించే ఓ కొత్త మెరుపంటే ఐష్‌కి ఇష్టం.
►వీలైనంత శుభ్రంగా ఉండాలనుకుంటారు. అలాగే పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటారు.
►పండగలప్పుడు షూటింగ్స్ ఉండకూడదని కోరుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి పండగ చేసుకోవడం ఐష్‌కి చాలా ఇష్టం. అలాగే, ఆ రోజు అందరికీ మిఠాయిలు పంచి, ఆనందిస్తారట.
►ఫేవరెట్ హాలిడే స్పాట్ ఫ్రాన్స్. అక్కడ ‘వైన్ ఫేషియల్’ చేస్తారని తెలిసి, ఓసారి చేయించుకున్నారట. ఆ ఫేషియల్ తెగ నచ్చేసిందని ఓ సందర్భంలో ఐష్ పేర్కొన్నారు. అందుకే ఫ్రాన్స్ వెళితే చాలు వైన్ ఫేషియల్ చేయించుకోకుండా ఇండియా రారట!