► చిరంజీవి నటించిన ‘పసివాడి ప్రాణం’ సినిమాలో బాల నటుడిగా నటించింది, బాబు కాదు పాప. ఈ పాప పేరు ఏంటి?
ఎ) సుజిత బి) సుహాసిని సి) సురభి డి) హారతి
► ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం చిత్రంలో అర్ధరూపాయి కోసం ఐస్‌పై నిలబడే బాలనటుడు ఎవరు?
ఎ) హర్షిత్ బి) హాశ్రిత్ సి) తేజ.సజ్జా డి) బాలాదిత్య
► 2017వ సంవత్సరపు బాలల చలన చిత్రోత్సవంలో ‘అప్పూ’ అనే చిత్రం ద్వారా సందడి చేసిన బాల నటుడు శ్రీసాయి శ్రీవంత్. చిత్ర దర్శకుని పేరేంటో కనుక్కోండి...
ఎ) అల్లాణి శ్రీధర్ బి) అక్కినేని కుటుంబరావు సి) కె. మోహన్ డి) ‘డాడి’ శ్రీనివాస్
► యన్టీఆర్‌తో బడిపంతులు సినిమాలో మనవరాలుగా నటించిన ఈ బాల నటి తర్వాత కాలంలో ఆయన పక్కన చాలా సినిమాల్లో డ్యూయట్లు పాడింది. ఎవరామె?
ఎ) విజయనిర్మల బి) జయసుధ సి) శ్రీదేవి డి) జయప్రద
► చిన్నారి పెళ్లికూతురు హిందీ టీవీ సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ నటి తెలుగు హీరో రాజ్‌తరుణ్‌తో రెండు సినిమాలలో నటించింది. ఆమె ఎవరు?
ఎ) అవికాగోర్ బి) శ్వేతా బసు ప్రసాద్ సి) ఉల్కాగుప్తా డి) శ్రియా శర్మ
► అఖిల్ బాలనటునిగా నటించిన సినిమా ఏమిటి?
ఎ) సిసింద్రీ బి) బాలరామాయణంసి) డాడి డి) అంజలి
► మణిరత్నం దర్శకత్వం వహించిన ‘అంజలి’ అనే సినిమాలో బాలనటిగా నటించింది షామిలి. ఆమె అక్క షాలిని. ఓ హీరోని పెళ్లి చేసుకుంది. ఆ హీరో పేరేంటి?
ఎ) విజయ్ బి) అజిత్ సి) విక్రమ్ డి) సూర్య
► ‘కుక్క కావాలి’ అంటూ ‘చిత్రం’ సినిమాలో మారాం చేసే పాత్రను పోషించిన బాలనటి చేతన ఇప్పుడు హీరోయిన్‌గా పరిచయమైంది. ఈమె ఒక నటుని కూతురు. ఆ నటుడెవరు?
ఎ) సాయికుమార్ బి) చిన్నా సి) ఉత్తేజ్ డి) గణేశ్
► ‘మమతల కోవెల’ అనే చిత్రంలో హీరో కూతురిగా నటించిన బాలనటి తర్వాత కాలంలో తెలుగు, తమిళ, కన్నడ, హింది భాషల్లో హీరోయిన్‌గా నటించింది? ఆమె ఎవరై ఉంటారు?
ఎ) రాశి బి) నిత్యామీనన్ సి) రోహిణి డి) మీనా
► ఏ దర్శకుని కొడుకు మొదట బాలనటుడిగా నటించి ‘ఆంధ్రాపోరి’అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు?
ఎ) కృష్ణ వంశీ బి) పూరి జగన్నాథ్ సి) గుణశేఖర్ డి) యన్ శంకర్
► ‘కోయి మిల్ గయా’ అనే హిందీ సినిమాలో హృతిక్‌రోషన్‌తో నటించిన బాల నటి ఎవరు.ఆమె తెలుగు,తమిళ సినిమాల్లో ఇప్పుడు హ్యాపెనింగ్ హీరోయిన్. ఎవరామె?
ఎ) జెనీలియా బి) హన్సిక సి) శ్రద్ధా కపూర్ డి) నిషా అగర్వాల్
► ‘తల్లో మల్లె పూలు పెట్టుకోవాలి’ అంటూ ఈ బుడతడు చెప్పిన డైలాగ్ ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రం లోనిది. ఇప్పుడు అతను హీరో అయ్యాడు. అతని పేరేంటి?
ఎ) కౌశిక్ బి) నాగ అన్వేష్ సి) బాలాదిత్య డి) మనోజ్ నందం
► వెంకటేశ్ బాల నటునిగా నటించిన చిత్రంపేరేంటో కనుక్కోండి...
ఎ) ప్రేమాభిషేకం బి) మేఘ సందేశం సి) ప్రేమనగర్‌డి) శ్రీరంగనీతులు
► శివాజి గణేశన్ మరియు రజనీకాంత్‌లతో చాలా సినిమాల్లో బాల నటించిన అల్లరిపిల్ల ఎవరై ఉంటారు? తర్వాత కాలంలో ఆమె చాలా పెద్ద హీరోయిన్‌గా చాలా సినిమాల్లో నటించింది?
ఎ) మీనా బి) సుహాసిని సి) సిమ్రాన్ డి) రమ్యకృష్ణ
► ఈ దర్శకుడు బాల నటుడుగా చాలా సినిమాల్లో నటì ంచాడు? హీరో సుమంత్‌కు బ్లాక్ బాస్టర్ హిట్‌ను అందించాటు? అతని పేరేంటì ?
ఎ) చక్రి బి) సూర్యకిరణ్ సి) భీమినేని శ్రీనివాసరావు డి) అనిల్ రావిపూడి
► భంగిమ అంటూ ‘సాగర సంగమం’ సినిమాలో ఫోటోలు తీసిన ఈ బాలనటుడు గుర్తున్నాడా? తర్వాత కమల్‌హాసన్ నటించిన ‘ఈనాడు’సినిమాకు ఆ బాల నటుడే దర్శకత్వం వహించాడు. అతనెవరు?
ఎ) శ్రీనివాస చక్రవర్తి బి) శ్రీరామ్ ఆదిత్య సి) చక్రి చిగురుపాటి డి)చక్రి తోలేటి
► బాల నటునిగా కూడా మంచి క్రేజ్ ఉన్న నటుడు తరుణ్, హీరోగా నటించిన తొలి సినిమా ఏది?
ఎ) ప్రియమైన నీకు బి) నువ్వులేక నేనులేను సి) నువ్వేకావాలి డి) నువ్వే నువ్వే
► ఈ ఫోటో లోని అందాల అభినేత్రిసావిత్రితో ఉన్న ఈ బాలనటుణ్ణి గుర్తుపట్టండి? తర్వాత ఆయన లోకనాయకుడయ్యాడు?
ఎ) కమల్ హాసన్ బి) నాగార్జున సి) కార్తీక్ డి) సురేశ్
► మేజర్ చంద్రకాంత్ చిత్రంలో యన్టీఆర్ మనవడిగా నటించిన బాల నటుడు ఇప్పుడు రాకింగ్ స్టార్. ఎవరతను?
ఎ) విష్ణు బి) మనోజ్ సి) ఆది పినిశెట్టి డి) ఆది సాయికుమార్
► ఈ ఫోటోలో రామునిగా నటించిన బాల నటుడు ఎవరో గుర్తుపట్టండి?
ఎ) కళ్యాణ్‌రామ్ బి) జూనియర్ యన్టీఆర్ సి) తారకరత్న డి) మోహనకృష్ణ
మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం
10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్
15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి
20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి!
సమాధానాలు
1) ఎ 2) డి 3) సి 4) సి5) ఎ 6) ఎ 7) బి 8) సి 9) ఎ10) బి 11) బి 12) బి13) సి 14) ఎ 15) బి 16) డి 17) సి 18) ఎ19) బి 20) బి
Comments
Please login to add a commentAdd a comment