అటు డ్యాన్స్‌... ఇటు ఫైట్‌ | Shraddha Kapoor dance film ABCD 3 on the sets of Saaho | Sakshi
Sakshi News home page

అటు డ్యాన్స్‌... ఇటు ఫైట్‌

Published Sat, Jan 12 2019 12:34 AM | Last Updated on Wed, Jul 17 2019 10:14 AM

Shraddha Kapoor dance film ABCD 3 on the sets of Saaho - Sakshi

శ్రద్ధా కపూర్‌

డ్యాన్స్‌ మూమెంట్స్‌ను బాగా ప్రాక్టీస్‌ చేసిన తర్వాత డైరెక్టర్‌ యాక్షన్‌ అనగానే ఫైట్‌ స్టార్ట్‌ చేస్తున్నారు బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌. ఏంటి? ఆమె కన్‌ఫ్యూజ్‌ అయ్యారా? అని ఆలోచించకండి. ఎందుకంటే  శ్రద్ధా ఫుల్‌ క్లారిటీతోనే అలా చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే... ప్రస్తుతం ‘సాహో’ మూవీ యాక్షన్‌ సీన్స్‌లో పాల్గొంటున్నారామె. ఈ సినిమా షాట్‌ గ్యాప్‌లో డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసేది రీసెంట్‌గా సైన్‌ చేసిన ‘ఏబీసీడీ 3’ చిత్రం కోసమే. రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్‌ధావన్‌ కథానాయకుడు. నోరా ఫతేహి కీలక పాత్ర చేస్తారు.

తొలుత ఈ సినిమాలో కత్రినా కైఫ్‌ను కథానాయికగా తీసుకున్నారు. కానీ, సల్మాన్‌తో కత్రినా చేస్తున్న ‘భారత్‌’ సినిమా డేట్స్‌ ‘ఏబీసీడీ 3’తో క్లాష్‌ అవడం.. కత్రినా తప్పుకోవడంతో శ్రద్ధా లైన్లోకి వచ్చారు. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి ఎక్కువ టైమ్‌ లేకపోవడంతో ‘సాహో’ సెట్‌లోనే డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారట శ్రద్ధా కపూర్‌.  శ్రద్ధా మాత్రమే కాదు.. వరుణ్‌ ధావన్‌ కూడా డ్యాన్స్‌ రిహార్సల్స్‌ చేస్తున్నారు. అయితే ఆయన ముంబైలో.. శ్రద్ధా మాత్రం ఏ షూటింగ్‌లో ఉంటే అక్కడే. ‘సాహో, ఏబీసీడీ 3’ సినిమాలే కాకుండా ‘చిఛోరే, సైనా’ చిత్రాలతో బిజీగా  ఉన్నారామె. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘సాహో’ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement