కాదు.. కాదు.. దుబాయ్‌లోనే. లేదు... లేదు.. హైదరాబాద్‌లోనే ఫిక్స్. ఇది.. ‘సాహో’ చిత్రంలోని చేజింగ్ సీక్వెన్స్ గురించి ఫిల్మ్‌నగర్‌లో జరుగుతున్న చర్చ. ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయిక. ఈ సినిమాలో ఇంటర్నేషనల్ థీఫ్ నుంచి పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా మారే వ్యక్తి క్యారెక్టర్‌లో ప్రభాస్ నటిస్తున్నారన్నది తాజా ఖబర్. ఇందులో ఎంతో కీలకమైన చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్‌కు ఆల్మోస్ట్ 10 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నారట. ఈ చేజింగ్ సీన్స్‌ను దుబాయ్‌లో షూట్ చేయాలనుకున్నారు.
హాలీవుడ్ కొరియోగ్రాఫర్ కెన్నీ బెట్స్ పర్యవేక్షణలో దర్శకుడు సుజీత్ లొకేషన్స్‌ను కూడా సెర్చ్ చేశారు. కానీ అనుకున్న సమయానికి షూట్ స్టార్ట్ కాలేదు. దీంతో హైదరాబాద్‌లో ఈ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. కానీ.. ఈ షెడ్యూల్ ఈ నెల ఎండింగ్‌లో దుబాయ్‌లోనే జరుగుతుందని ఈ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ యాక్టర్ నీల్ నితిన్ ముఖేష్ పేర్కొన్నారు. ‘సాహో’ గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘నాకు తెలిసి దుబాయ్ షెడ్యూల్‌లో చేంజ్ ఏమీ లేదు. ఈ మంత్ ఎండింగ్‌లో దుబాయ్ షెడ్యూల్ స్టార్ట్ కావచ్చు. బుర్జ్ ఖలీఫా, అబుదాబిలో ‘సాహో’ టీమ్‌తో వర్క్ చేయడానికి ఆసక్తిగా ఎదరుచూస్తున్నాను’’ అని నీల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment