Chasing Scene
-
సముద్రంలో ఛేజింగ్ సీన్
-
ప్రభాస్ 20 : తాజా అప్డేట్
హైదరాబాద్ : సాహో తర్వాత ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న మూవీ నుంచి తాజా అప్డేట్ను చిత్ర యూనిట్ అభిమానులతో పంచుకుంది. ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ ఛేజింగ్ సీన్లో ప్రభాస్ పాల్గొన్న దృశ్యాలను షూట్ చేసినట్టు యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది. గ్లోబల్ ఆడియెన్స్‌కు రీచ్ అయ్యేలా ప్రభాస్ 20 మూవీని నిర్మాతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అంతర్జాతీయ ప్రొఫెషనల్స్ సహకారంతో ఈ సీన్‌ను తెరకెక్కించామని, ఇక యూరప్‌లో భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశామని, మరిన్ని అప్డేట్స్ త్వరలో వెల్లడిస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. ఇక చిత్ర బృందం 20 రోజుల షెడ్యూల్ కోసం జార్జియా బయలుదేరింది. మార్చి 15 నుంచి 20 రోజుల పాటు జార్జియాలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారు. ఈ షెడ్యూల్లో ప్రభాస్, పూజా హెగ్డేలతో పాటు ప్రధాన తారాగణంపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఈ షెడ్యూల్ అనంతరం కొద్దిరోజుల విరామం అనంతరం హైదరాబాద్‌లో షూటింగ్ కొనసాగుతుంది. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. A cute chase sequence with a terrific international crew has been completed. A long schedule in Europe awaits now. More updates soon! #Prabhas20 — UV Creations (@UV_Creations) March 10, 2020 చదవండి : హ్యపీ బర్త్‌డే స్వీటెస్ట్ అమృత: ప్రభాస్ -
మార్పు లేదు!
కాదు.. కాదు.. దుబాయ్‌లోనే. లేదు... లేదు.. హైదరాబాద్‌లోనే ఫిక్స్. ఇది.. ‘సాహో’ చిత్రంలోని చేజింగ్ సీక్వెన్స్ గురించి ఫిల్మ్‌నగర్‌లో జరుగుతున్న చర్చ. ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న సినిమా ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయిక. ఈ సినిమాలో ఇంటర్నేషనల్ థీఫ్ నుంచి పోలీస్ ఇన్ఫార్మర్గా మారే వ్యక్తి క్యారెక్టర్లో ప్రభాస్ నటిస్తున్నారన్నది తాజా ఖబర్. ఇందులో ఎంతో కీలకమైన చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్‌కు ఆల్మోస్ట్ 10 కోట్లకు పైనే ఖర్చు చేస్తున్నారట. ఈ చేజింగ్ సీన్స్‌ను దుబాయ్‌లో షూట్ చేయాలనుకున్నారు. హాలీవుడ్ కొరియోగ్రాఫర్ కెన్నీ బెట్స్ పర్యవేక్షణలో దర్శకుడు సుజీత్ లొకేషన్స్‌ను కూడా సెర్చ్ చేశారు. కానీ అనుకున్న సమయానికి షూట్ స్టార్ట్ కాలేదు. దీంతో హైదరాబాద్‌లో ఈ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. కానీ.. ఈ షెడ్యూల్ ఈ నెల ఎండింగ్లో దుబాయ్‌లోనే జరుగుతుందని ఈ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ యాక్టర్ నీల్ నితిన్ ముఖేష్ పేర్కొన్నారు. ‘సాహో’ గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘నాకు తెలిసి దుబాయ్ షెడ్యూల్లో చేంజ్ ఏమీ లేదు. ఈ మంత్ ఎండింగ్లో దుబాయ్ షెడ్యూల్ స్టార్ట్ కావచ్చు. బుర్జ్ ఖలీఫా, అబుదాబిలో ‘సాహో’ టీమ్‌తో వర్క్ చేయడానికి ఆసక్తిగా ఎదరుచూస్తున్నాను’’ అని నీల్ అన్నారు. -
ఎవరు ఎవరిని ఛేజ్ చేస్తారు?
అది ప్యారిస్ నగరం... చాలా అందంగా ఉంటుంది. రోడ్లన్నీ చాలా విశాలంగా ఉంటాయి. ఆ విశాలమైన రహదారుల్లో ఏదైనా కారును ఛేజ్ చేయాల్సి వస్తే? వేగాన్ని లెక్క చేయకుండా వాహనాన్ని దౌడు తీయించొచ్చు. త్వరలో నాగార్జున, కార్తి అదే చేయనున్నారు. వీళ్లిద్దరూ కలిసి ఎవరినైనా ఛేజ్ చేస్తారా? లేక వీళ్లే ఒకర్నొకరు వెంటాడతారా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. నాగ్, కార్తి, తమన్నా ముఖ్య తారలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పొట్లూరి వి. ప్రసాద్ ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసమే ఛేజింగ్ సీన్ చిత్రీకరించనున్నారు. ఇప్పటివరకూ హైదరాబాద్, చెన్నయ్‌లలో భారీ షెడ్యూల్స్ చేశారు. ఈ నెల 7న ఈ చిత్రబృందం విదేశాలకు వెళ్లనుంది. ఆ విశేషాలను నిర్మాత తెలియజేస్తూ - ‘‘ఈ నెల 7 నుంచి యూరప్‌లో షూటింగ్ మొదలుపెడతాం. సౌత్ ఈస్ట్ యూరప్‌లో పెద్ద నగరమైన బెల్గ్రేడ్లో ఇప్పటివరకూ ఏ దక్షిణాది సినిమా షూటింగ్ చేయలేదు. ఆ ఘనత ఈ చిత్రానికే దక్కుతుంది. బెల్గ్రేడ్ తర్వాత ప్యారిస్, లియాన్‌లలో షూటింగ్ చేస్తాం. స్లొవేనియా రాజధాని జబ్లిజనాలో కూడా కొంత భాగం చిత్రీకరిస్తాం. యాక్షన్ సన్నివేశాలతో పాటు, పాటల చిత్రీకరణను కూడా ప్లాన్ చేశాం. ఈ చిత్రానికి గోపీసుందర్ మంచి స్వరాలు కూర్చారు’’ అని చెప్పారు.