కోర్ట్‌ చుట్టూ యామీ | YAMI GAUTAM HEADS TO COURT FOR BATTI GUL METER CHALU | Sakshi
Sakshi News home page

కోర్ట్‌ చుట్టూ యామీ

Published Sun, May 27 2018 1:04 AM | Last Updated on Sun, May 27 2018 1:04 AM

YAMI GAUTAM HEADS TO COURT FOR BATTI GUL METER CHALU - Sakshi

యామీ గౌతమ్‌

కోర్ట్‌ చుట్టూ తిరగనున్నారు బాలీవుడ్‌ భామ యామీ గౌతమ్‌. అయ్యో.. ఏం కేస్‌లో ఇరుకున్నారు పాపం? అనుకోకండి. కోర్ట్‌కి వెళ్తుంది కేస్‌ మీద కాదు. క్యారెక్టర్‌ ప్రిపరేషన్‌ కోసం. షాహిద్‌ కపూర్, శ్రద్ధా కపూర్‌ జంటగా శ్రీ నారయణ్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బట్టి గుల్‌ మీటర్‌ చాలు’. ఇందులో యామీ గౌతమ్‌ కీ రోల్‌ ప్లే చేస్తున్నారు. గ్రామాల్లో కరెంట్‌ కష్టాల గురించి ఈ సినిమా డిస్కస్‌ చేయనుందట.

ఇందులో యామీ గౌతమ్‌ లాయర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రను కరెక్ట్‌గా పోషించడం కోసం ప్రిపరేషన్‌లో భాగంగా కోర్ట్‌కు హాజరవ్వాలనుకుంటున్నారట యామీ. వచ్చే నెలలో షెడ్యూల్‌ స్టార్ట్‌ అయ్యేసరికి రెండు మూడు కోర్ట్‌ హియరింగ్స్‌ అయినా అటెండ్‌ అవ్వాలనుకుంటున్నారట యామీ. పాత్ర పట్ల తనకున్న డెడికేషన్‌కి చూసి ఆశ్చర్యపోతున్నారట ‘బట్టి గుల్‌...’ చిత్రబృందం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement