సాహో చేజ్ వాయిదా పడిందా? అంటే.. ‘అవును’! అనే ఆన్సర్ ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. చేజ్ తీసే టైమ్‌లో చేంజ్ ఉండొచ్చేమో కానీ క్యాన్సిల్ అయ్యే స్కోప్ మాత్రం లేదంటున్నారట చిత్రబృందం. ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రం ‘సాహో’. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తోన్న ఈ సినిమాలో బీటౌన్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయిక.
చేజ్‌తో కూడిన యాక్షన్ సీక్వెన్స్‌ను దుబాయ్‌లో షూట్ చేయడానికి ఈ చిత్రబృందం ప్లాన్ చేశారు. సుజీత్ లొకేషన్స్ వేట కూడా కంప్లీట్ చేశారు. అయితే అక్కడి గవర్నమెంట్ పర్మిషన్స్ ప్రాబ్లమ్స్ వల్ల దుబాయ్ షెడ్యూల్ ప్రజెంట్ వాయిదా పడిందనేది ఫిల్మ్‌నగర్ సమాచారం. అంతేకాదు సినిమా లేట్ కాకుండా ఉండేందుకు ఫ్రెష్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. జనవరిలో ఈ షెడ్యూల్ మొదలవుతుందట. సో.. ‘సాహో’ టీమ్ అంతా దుబాయ్ టు హైదరాబాద్ షిఫ్ట్ అయిందన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment