shooting cancelled
-
ఆగిన పుష్ప షూటింగ్; ఐసోలేషన్లోకి సుకుమార్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. కోవిడ్ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల పునఃప్రారంభమైంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లిలో జరుగుతోంది. ఇక్కడే నెల రోజుల షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ సెగ ఇప్పుడు పుష్ప సినిమా షూటింగ్‌పై పడింది. చదవండి: బన్నీకి విజయ్ దేవరకొండ సర్ప్రైజ్.. సుకుమార్ ప్రొడక్షన్ టీం సభ్యుడు ఇటీవలే చనిపోయాడు. అతనికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. కాగా ఈ వ్యక్తి మారేడుపల్లి షూటింగ్ సమయంలో టీం సభ్యులందరితో కలిసి పనిచేయడంతో ప్రస్తుతం పుష్ప షూటింగ్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యక్తి అల్లు అర్జున్‌తో ఎక్కవ కాంటాక్ట్ కాలేదు కానీ సెట్లో పనిచేస్తున్న క్రమంలో మిగతా బృందంతో ఇంటరాక్ట్ అయినట్లు సమాచారం. అలాగే పుష్ప’ యూనిట్లో కొంత మందికి కొవిడ్-19 లక్షణాలు కనిపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: మారేడుపల్లి అడవుల్లోకి పుష్ప టీం దీంతో టీం సభ్యులంతా కోవిడ్ టెస్ట్ చేయనుండటంతోపాటు ఉన్నపాటుగా షూటింగ్ రద్దు చేసుకొని హైదరాబాద్‌కు పయనం కట్టినట్లు గుసగుసలు వ్యాపిస్తున్నాయి. అంతేగాక దర్శకుడు సుకుమార్ సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారని, త్వరలో కోవిడ్ టెస్టు చేసుకోనున్నారని తెలుస్తోంది. అతనితోపాటు నిర్మాతలు కూడా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన వెంటనే కరోనా టెస్ట్ చేసుకోనున్నారు. అయితే వారికి కరోనా సోకిందో లేదో తెలుసుకునేందుకు ఓ వారంపాటు వేచి ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇవన్నీ వదంతులు మాత్రమే. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. చదవండి: అల్లు అర్హ ‘అంజలి’ వీడియో సాంగ్.. ట్రెండింగ్‌లో -
‘ఆర్ఆర్ఆర్’ ట్రయిల్ షూట్ రద్దు.. అందుకేనా!
ప్రజా జీవనాన్ని కరోనా వైరస్ ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి చేసింది. వైరస్ నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌తో అన్ని సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమల్లోనూ షూటింగ్‌లు వాయిదా పడ్డాయి. దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం) చిత్ర షూటింగ్‌కు కూడా బ్రేక్ పడింది. కాగా ఇటీవల షూటింగ్‌లకు ప్రభుత్వం షరతులతో కూడిన సడలింపులు ఇవ్వడంతో టెలివిజన్ సీరియళ్లు, కొన్ని సినిమాలు తిరిగి షూటింగ్‌ను ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ ట్రయిల్ షూట్ ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావించారు. దాదాపు రెండు నెలల తర్వాత హైదరాబాద్‌లో 2 రోజుల ట్రయిల్ షూట్ మొదలు పెట్టేందుకు రాజమౌళి సిద్ధమయ్యారు. (‘రాజ్ కపూర్ తర్వాత ప్రభాస్‌కే’) 50 శాతం సిబ్బందితో అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదవుతుండటం వల్ల ట్రయిల్ షూట్ రద్ధు అయినట్లు తెలుస్తోంది. వైరస్ కారణంగా పెరుగుతున్న ఆందోళనల మధ్య ప్రస్తుతం దీనిని కూడా నిలిపివేయాలని బృందం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించి 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకోగా మిగతా 30 శాతం చిత్రీకరణ జరగాల్సి ఉంది. (పరిస్థితులకు తగ్గట్టు మసలుకోవాలి: చెర్రీ) -
ఆర్ట్ బై సోనాక్షీ
కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. దీంతో హీరోహీరోయిన్లందరూ హోమ్ క్వారంటైన్లో ఉంటున్నారు. కుకింగ్, రీడింగ్, క్లీనింగ్... ఇలా ఏదో ఒకటి చేస్తు టైమ్‌పాస్ చేస్తున్నారు. హీరోయిన్ సోనాక్షీ సిన్హా రోజుకో బొమ్మ గీస్తున్నారు. ‘‘కొన్నేళ్ల క్రితమే బొమ్మలు గీయడం అలవాటు చేసుకున్నాను. ఈ అలవాటు నాకు మెడిటేషన్లా అనిపిస్తోంది. నాకు సరైన స్ట్రెస్ బస్టర్ పెయింటింగ్. నేను చాలా పెయింటింగ్స్ వేశాను’’ అని పేర్కొన్నారు సోనాక్షీ. ఇటీవల ఆమె వేసిన డ్రాయింగ్స్‌ను ‘ఆర్ట్ బై సోనాక్షీ’గా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలు సోనాక్షీ గీసినవే. -
ఊపిరి తీసుకోవడమే కష్టం.. ఇంకా షూటింగా
న్యూఢిల్లీ: తీవ్రమైన కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించాలని, ఆ పొగలో తాము నివసించలేకపోతున్నామని నగర ప్రజలు మొత్తుకుంటున్నారు. ఇక కాలుష్యం కష్టాలు సినిమా వాళ్లను కూడా ఇబ్బందుల్లోకి నెట్టాయి. కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్, లక్ష్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘దోస్తానా 2’. షూటింగ్ షెడ్యూల్లో భాగంగా ఢిల్లీలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉంది. అయితే ప్రస్తుతం దేశ రాజధానిలో ఆవరించి ఉన్న తెల్లటి దట్టమైన పొగతో ఎదుటివాళ్లు సైతం సరిగా కనిపించలేని పరిస్థితి నెలకొంది. దీంతో సినిమా చిత్రీకరణ కష్టమని భావించిన యూనిట్.. షూటింగ్ రద్దు చేసుకుంది. కనీసం ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉండటంతో వాతావరణం తిరిగి సాధారణ స్థితికి వచ్చేవరకు షూటింగ్‌ను నిలిపివేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. కాగా 2008లో ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘దోస్తానా’ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి ‘దోస్తానా 2’ సీక్వెల్‌గా రానుంది. -
షిఫ్ట్ టు హైదరాబాద్
సాహో చేజ్ వాయిదా పడిందా? అంటే.. ‘అవును’! అనే ఆన్సర్ ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. చేజ్ తీసే టైమ్‌లో చేంజ్ ఉండొచ్చేమో కానీ క్యాన్సిల్ అయ్యే స్కోప్ మాత్రం లేదంటున్నారట చిత్రబృందం. ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం ‘సాహో’. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తోన్న ఈ సినిమాలో బీటౌన్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయిక. చేజ్‌తో కూడిన యాక్షన్ సీక్వెన్స్‌ను దుబాయ్‌లో షూట్ చేయడానికి ఈ చిత్రబృందం ప్లాన్ చేశారు. సుజీత్ లొకేషన్స్ వేట కూడా కంప్లీట్ చేశారు. అయితే అక్కడి గవర్నమెంట్ పర్మిషన్స్ ప్రాబ్లమ్స్ వల్ల దుబాయ్ షెడ్యూల్ ప్రజెంట్ వాయిదా పడిందనేది ఫిల్మ్‌నగర్ సమాచారం. అంతేకాదు సినిమా లేట్ కాకుండా ఉండేందుకు ఫ్రెష్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. జనవరిలో ఈ షెడ్యూల్ మొదలవుతుందట. సో.. ‘సాహో’ టీమ్ అంతా దుబాయ్ టు హైదరాబాద్ షిఫ్ట్ అయిందన్నమాట. -
ఎక్కువ కాలేదు... తక్కువ కాలేదు... ఎవరూ చావలేదు!
ఎక్కువ కాలేదు... తక్కువ కాలేదు! ఏంటది? వంట అండ్ వంటలోకి కావలసిన దినుసులు గట్రా! సమంత వండిన వంటలో ఏదీ ఎక్కువ కాలేదట... ఏదీ తక్కువ కాలేదట! యస్... శనివారం సమంత ఇంట్లో వంట చేశారు. ఎందుకు? అంటే... షూటింగ్ క్యాన్సిల్ అయ్యిందని! ఖాళీగా ఉండడంతో కిచెన్‌లోకి వెళ్లి... కూరగాయలు కట్ చేశారు. స్టవ్ అంటించి, నాన్‌స్టిక్ కడాయిపై నాన్‌వెజ్ కూడా కుక్ చేశారు. ఆ తర్వాత నా వంట తిని ఎవరూ చావలేదని సమంతే చెప్పారు. ‘నో వన్ డైడ్... యస్... స్స్!!’ అని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో సమంత పేర్కొన్నారు. షూటింగ్ క్యాన్సిల్ అయితే... ఆ రోజు వంట చేయడమే అని సోషల్ మీడియాలో ఆమె తెలిపారు. పెళ్లికి ముందు నాగచైతన్య వంట చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో ఎక్కువగా పోస్ట్ చేసేవారీమె. పెళ్లి తర్వాత తీరిక చిక్కినప్పుడల్లా ముద్దుల శ్రీవారికి సమంతే వంట చేస్తున్నట్టున్నారు. బహుశా... ‘నేను వంట చేశానోచ్’ అని సమంత పబ్లిగ్గా చెప్పుకోవడమూ ఇదే తొలిసారి అనుకుంటా! నా వంట తిని ఎవరూ చావలేదని చెప్పారు గానీ... టేస్ట్ ఎలా ఉందో ఆమె చెప్పలేదు. నెక్ట్స్ టైమ్ సమంత గానీ... చైతన్య గానీ... కలసినప్పుడు అడుగుదాంలెండి!! -
కబాలి కోసం అంజలి చిత్ర షూటింగ్ రద్దు
పెద్ద హీరోల చిత్రాలు విడుదలవుతున్నాయంటే చిన్న చిత్రాల విడుదలను వాయిదా వేసుకోవడం చూశాం. కానీ ఒక భారీ చిత్రం తెరపైకి వస్తున్న రోజున ఇతర చిత్రాల షూటింగ్‌ను రద్దు చేసుకోవడం అన్నది ఎక్కడా జరగలేదు. అలాంటి సంఘటన ఇప్పుడు జరగబోతోంది. అదేమిటో చూద్దాం. క్రేజీ జంట జై, అంజిలి జంటగా నటిస్తున్న తాజా చిత్రానికి బెలూన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ మధ్యనే షూటింగ్ మొదలైన ఈ చిత్రాన్ని 70ఎంఎం సంస్థ అధినేతలు టీఎన్.అరుణ్‌బాలాజీ, కందస్వామి నందకుమార్, ఫార్మర్స్ మాస్టర్ ప్లాన్ అధినేత దిలీప్ సుబ్బరాయన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి సినీష్ దర్శకుడు. ఈయన సూపర్‌స్టార్ రజనీకాంత్ వీరాభిమాని అట. కాగా కబాలి చిత్రం ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతున్న విషయం తెలిసిం దే. రజనీకాంత్ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జులై 22ను కబాలి రోజుగా భావిస్తూ తామూ ఆ వేడుకలో భాగం కావాలనుకుంటున్నామని బెలూన్ చిత్ర దర్శకుడు సినీష్ పేర్కొన్నారు. అలా అందరిలానే కబాలి చిత్ర విడుదల కోసం, అది సాధించే సంచలన విజయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా తమ కోరికను మన్నించి 22వ తేదీన బెలూన్ చిత్ర షూటింగ్‌ను రద్దు చేయడానికి అంగీకరించిన చిత్ర యూనిట్ తరఫున నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటునట్లు దర్శకుడు సినీష్ అన్నారు.