
సోనాక్షీ సిన్హా
కరోనా వైరస్ ప్రభావంతో షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. దీంతో హీరోహీరోయిన్లందరూ హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. కుకింగ్, రీడింగ్, క్లీనింగ్... ఇలా ఏదో ఒకటి చేస్తు టైమ్‌పాస్ చేస్తున్నారు. హీరోయిన్ సోనాక్షీ సిన్హా రోజుకో బొమ్మ గీస్తున్నారు. ‘‘కొన్నేళ్ల క్రితమే బొమ్మలు గీయడం అలవాటు చేసుకున్నాను. ఈ అలవాటు నాకు మెడిటేషన్‌లా అనిపిస్తోంది. నాకు సరైన స్ట్రెస్ బస్టర్ పెయింటింగ్. నేను చాలా పెయింటింగ్స్ వేశాను’’ అని పేర్కొన్నారు సోనాక్షీ. ఇటీవల ఆమె వేసిన డ్రాయింగ్స్‌ను ‘ఆర్ట్ బై సోనాక్షీ’గా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలు సోనాక్షీ గీసినవే.
Comments
Please login to add a commentAdd a comment