కబాలి కోసం అంజలి చిత్ర షూటింగ్ రద్దు | Kollywood shooting cancelled on Kabali release | Sakshi
Sakshi News home page

కబాలి కోసం అంజలి చిత్ర షూటింగ్ రద్దు

Jul 20 2016 2:31 AM | Updated on Sep 4 2017 5:19 AM

కబాలి కోసం అంజలి చిత్ర షూటింగ్ రద్దు

కబాలి కోసం అంజలి చిత్ర షూటింగ్ రద్దు

పెద్ద హీరోల చిత్రాలు విడుదలవుతున్నాయంటే చిన్న చిత్రాల విడుదలను వాయిదా వేసుకోవడం చూశాం.

 పెద్ద హీరోల చిత్రాలు విడుదలవుతున్నాయంటే చిన్న చిత్రాల విడుదలను వాయిదా వేసుకోవడం చూశాం. కానీ ఒక భారీ చిత్రం తెరపైకి వస్తున్న రోజున ఇతర చిత్రాల షూటింగ్‌ను రద్దు చేసుకోవడం అన్నది ఎక్కడా జరగలేదు. అలాంటి సంఘటన ఇప్పుడు జరగబోతోంది. అదేమిటో చూద్దాం. క్రేజీ జంట జై, అంజిలి జంటగా నటిస్తున్న తాజా చిత్రానికి బెలూన్ అనే టైటిల్‌ను నిర్ణయించారు.
 
  ఈ మధ్యనే షూటింగ్ మొదలైన ఈ చిత్రాన్ని 70ఎంఎం సంస్థ అధినేతలు టీఎన్.అరుణ్‌బాలాజీ, కందస్వామి నందకుమార్, ఫార్మర్స్ మాస్టర్ ప్లాన్ అధినేత దిలీప్ సుబ్బరాయన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి సినీష్ దర్శకుడు. ఈయన సూపర్‌స్టార్ రజనీకాంత్ వీరాభిమాని అట. కాగా కబాలి చిత్రం ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతున్న విషయం తెలిసిం దే. రజనీకాంత్ అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో జులై 22ను కబాలి రోజుగా భావిస్తూ తామూ ఆ వేడుకలో భాగం కావాలనుకుంటున్నామని బెలూన్ చిత్ర దర్శకుడు సినీష్ పేర్కొన్నారు.
 
 అలా అందరిలానే కబాలి చిత్ర విడుదల కోసం, అది సాధించే సంచలన విజయం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా తమ కోరికను మన్నించి 22వ తేదీన బెలూన్ చిత్ర షూటింగ్‌ను రద్దు చేయడానికి అంగీకరించిన చిత్ర యూనిట్ తరఫున నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటునట్లు దర్శకుడు సినీష్ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement