క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. కోవిడ్ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవల పునఃప్రారంభమైంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లిలో జరుగుతోంది. ఇక్కడే నెల రోజుల షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఇదిలా ఉండగా కరోనా వైరస్ సెగ ఇప్పుడు పుష్ప సినిమా షూటింగ్‌పై పడింది. చదవండి: బన్నీకి విజయ్ దేవరకొండ సర్‌ప్రైజ్..
సుకుమార్ ప్రొడక్షన్ టీం సభ్యుడు ఇటీవలే చనిపోయాడు. అతనికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలింది. కాగా ఈ వ్యక్తి మారేడుపల్లి షూటింగ్ సమయంలో టీం సభ్యులందరితో కలిసి పనిచేయడంతో ప్రస్తుతం పుష్ప షూటింగ్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యక్తి అల్లు అర్జున్‌తో ఎక్కవ కాంటాక్ట్ కాలేదు కానీ సెట్‌లో పనిచేస్తున్న క్రమంలో మిగతా బృందంతో ఇంటరాక్ట్ అయినట్లు సమాచారం. అలాగే పుష్ప’ యూనిట్‌లో కొంత మందికి కొవిడ్-19 లక్షణాలు కనిపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: మారేడుపల్లి అడవుల్లోకి పుష్ప టీం
దీంతో టీం సభ్యులంతా కోవిడ్ టెస్ట్ చేయనుండటంతోపాటు ఉన్నపాటుగా షూటింగ్ రద్దు చేసుకొని హైదరాబాద్‌కు పయనం కట్టినట్లు గుసగుసలు వ్యాపిస్తున్నాయి. అంతేగాక దర్శకుడు సుకుమార్ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారని, త్వరలో కోవిడ్ టెస్టు చేసుకోనున్నారని తెలుస్తోంది. అతనితోపాటు నిర్మాతలు కూడా హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన వెంటనే కరోనా టెస్ట్ చేసుకోనున్నారు. అయితే వారికి కరోనా సోకిందో లేదో తెలుసుకునేందుకు ఓ వారంపాటు వేచి ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇవన్నీ వదంతులు మాత్రమే. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. చదవండి: అల్లు అర్హ ‘అంజలి’ వీడియో సాంగ్.. ట్రెండింగ్‌లో
Comments
Please login to add a commentAdd a comment