స్పెషల్‌ గెస్ట్‌ | misha entry on shahid kapur movie shootings | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ గెస్ట్‌

Published Mon, Jul 9 2018 1:27 AM | Last Updated on Mon, Jul 9 2018 1:27 AM

misha entry on shahid kapur movie shootings - Sakshi

కూతురుతో షాహిద్‌ కపూర్‌

షాహిద్‌ కపూర్‌ హీరోగా నటిస్తోన్న ‘బట్టీ గుల్‌ మీటర్‌ చాలు’ సినిమా సెట్‌లోకి ఓ స్పెషల్‌ గెస్ట్‌ ఎంటరయ్యారు. ఆ గెస్ట్‌ ఫేమస్‌ హీరోనో లేక డైరెక్టర్‌నో కాదు. షాహిద్‌ ముద్దుల తనయ మిషా కపూర్‌. ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ’ ఫేమ్‌ శ్రీ నారాయణ్‌సింగ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బట్టీ గుల్‌ మీటర్‌ చాలు’. షాహిద్‌ కపూర్, శ్రద్ధా కపూర్, యామీ గౌతమ్‌లు ముఖ్య తారలుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. షాహిద్, శ్రద్ధాలపై సాంగ్‌ను చిత్రీకరించారు. రీసెంట్‌గా ఈ సెట్‌లోకే స్పెషల్‌ గెస్ట్‌గా వచ్చారు మిషా. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నట్లు ఇంకోమాట.. త్వరలో మీషాకు తోడుగా తమ్ముడు లేక చెల్లి రానున్నారు. అదేనండీ.. ప్రస్తుతం షాహిద్‌ కపూర్‌ వైఫ్‌ మీరా రాజ్‌పుత్‌ ప్రెగ్నెంట్‌ అని చెప్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement