
లొకేషన్ వేట కంప్లీట్ అయ్యింది. దుబాయ్‌లో షూట్ స్పాట్‌ని ఫిక్స్ చేశారు. హీరో ప్రభాస్ ఆట మొదలు పెట్టి విలన్స్‌ను వేటాడడమే బ్యాలెన్స్. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘సాహో’. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తోన్న ఈ సినిమాలో బీటౌన్ బ్యూటీ శ్రద్ధాకపూర్ కథానాయిక.
‘సాహో’లో కీలకమైన చేజింగ్ సీన్స్‌ను చిత్రబృందం దుబాయ్‌లో ప్లాన్ చేశారు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బెట్స్ నేతృత్వంలో సాగే ఈ సీన్ ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ ఉంటుందట. ఇంతకీ ఈ సాహో రన్ ఎందుకు? ఎవరి కోసం జరుగుతుందనేది మాత్రం ప్రజెంట్ సస్పెన్స్. ప్యాలెస్ లాంటి హోటళ్లు, పడవంత కార్లు, ఎల్తైన బిల్డింగ్స్ వంటి ఏరియాల్లో ఈ చేజ్ ఉండదు. కొండ ప్రాంతాల్లో ప్లాన్ చేశారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment