
టైగర్ ష్రాఫ్
‘భాగీ’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో సినిమా ‘భాగీ3’. ఇందులో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించారు. హీరోయిన్‌గా శ్రద్ధాకపూర్ కనిపిస్తారు. అహ్మద్‌ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్ కీలక పాత్ర పోషించారు. ఇందులో రితేష్, టైగర్ ష్రాఫ్ బ్రదర్స్‌లా నటించారు. ‘భాగీ’ తొలి భాగంలో జంటగా నటించిన టైగర్, శ్రద్ధా ‘భాగీ 3’ కోసం తిరిగి కలిశారు. అలాగే ‘భాగీ 2’లో హీరోయిన్‌గా నటించిన దిశా పటానీ ‘భాగీ 3’లో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment