Baaghi movie
-
‘డూ యూ లవ్ మీ’: రెచ్చిపోయిన హీరోయిన్!
బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్, హీరోయిన్ శ్రద్ధా కపూర్లు జంటగా నటిస్తున్న చిత్రం భాగీ-3. అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిసాజిద్ నడియావాలా నిర్మిస్తున్నాడు. కాగా ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి టాక్ వచ్చింది. కాగా అన్నదమ్ముల అనుబంధానికి, యాక్షన్‌ను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు అహ్మద్. ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ అన్న పాత్రలో హీరో రితేశ్ దేశ్‌ముఖ్ నటించాడు. కాగా ఈ సినిమాలో టైగర్ ష్రాఫ్ ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న దిశా పటానీ ఓ ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో అమ్మడు ‘డు యూ లవ్ మీ’ అంటూ టైగర్ ష్రాఫ్ వెంట పడుతూ డ్యాన్స్ చేసిన ఈ సాంగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఫోటోగ్రాఫర్‌తో హీరోయిన్ బాడీగార్డ్ వాగ్వాదం కాగా ఈ సాంగ్‌లో బికినీ ధరించిన దిశా తన అందంతో టైగర్‌తో పాటు అభిమానులను ఆకట్టుకుంటోంది. అంతే కాదు కొన్ని అదుర్స్ అనిపించే స్టెప్పులేసి అదరగొట్టారు కూడా. ఈ నెల 25న విడుదలైన ఈ సాంగ్ యూట్యూబ్, ట్విటర్ ట్రెండింగ్ జాబితాలోకి చేరిపోయింది. ఇక మూడు రోజుల్లోనే యూట్యూబ్‌లో ఇప్పటి వరకూ దాదాపు కోటి 16 లక్షల వ్యూస్‌ను రాబట్టింది. అంతేగాక దిశా కూడా ఈ సాంగ్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో పంచుకున్నారు. కాగా అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో భాగికి సీక్వెల్‌గా భాగీ-2 వచ్చిన సంగతి తెలిసిందే. ఇక భాగి-3ని మార్చి 6న విడుదల చేయనున్నట్లు సమాచారం. View this post on Instagram Get ready to groove on with me. #DoYouLoveMe song out tomorrow. #SajidNadiadwala’s #Baaghi3 @tigerjackieshroff @shraddhakapoor @riteishd @khan_ahmedasas @wardakhannadiadwala @tanishk_bagchi @nikhitagandhiofficial @tseries.official @adil_choreographer @foxstarhindi @nadiadwalagrandson A post shared by disha patani (paatni) (@dishapatani) on Feb 25, 2020 at 11:43pm PST -
అదిరిపోయిన ‘భాగీ-3’ ట్రైలర్
ఉగ్రమూక ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) దురాగతాలతో.. నిరంతరం బాంబుల వర్షంతో మోతమోగే సిరియాలో బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. అలాంటి దేశంలో టెర్రరిస్టుల చేతికి చిక్కిన తన సోదరుడిని కాపాడుకునేందుకు హీరో చేసిన పోరాటం ఇతివృత్తంగా తెరకెక్కిన సినిమా భాగీ 3. బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కెరీర్‌ను మలుపుతిప్పిన భాగీ ప్రాంఛైజీలో వస్తున్న మూడో సినిమా ఇది. రితేశ్ దేశ్‌ముఖ్, టైగర్ ఇందులో అన్నదమ్ములుగా నటిస్తున్నారు. భాగీ సినిమాలో హీరోయిన్గా కనిపించిన శ్రద్ధా కపూర్.. ఈ సినిమాలోనూ టైగర్‌తో జోడీతో కట్టారు. కాగా అహ్మద్‌ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. దాదాపు 4 నిమిషాల నిడివి గల అద్భుతమైన యాక్షన్ ఫీట్లతో అదిరిపోయింది. సోదరుడిని కాపాడుకునేందుకు హీరో ఉగ్రమూకతో తలపడే తీరు వన్ మ్యాన్ షోను తలపించింది. ఇక ఈ సినిమా మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
గుమ్మడికాయ కొట్టారు
‘భాగీ’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో సినిమా ‘భాగీ3’. ఇందులో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించారు. హీరోయిన్గా శ్రద్ధాకపూర్ కనిపిస్తారు. అహ్మద్‌ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్ కీలక పాత్ర పోషించారు. ఇందులో రితేష్, టైగర్ ష్రాఫ్ బ్రదర్స్‌లా నటించారు. ‘భాగీ’ తొలి భాగంలో జంటగా నటించిన టైగర్, శ్రద్ధా ‘భాగీ 3’ కోసం తిరిగి కలిశారు. అలాగే ‘భాగీ 2’లో హీరోయిన్గా నటించిన దిశా పటానీ ‘భాగీ 3’లో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో సినిమా విడుదల కానుంది. -
యాక్షన్ ప్లాన్
శత్రువులపై దాడి చేయడానికి యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్. ఈ ప్లాన్‌లో నేనూ పాలుపంచుకుంటాను అంటున్నారు శ్రద్ధా కపూర్. ‘భాగీ’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం ‘భాగీ 3’. ౖటైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అహ్మద్‌ఖాన్ దర్శకుడు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం టైగర్ ష్రాఫ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల ముంబైలో ప్రారంభమైంది. టైగర్, శ్రద్ధా, రితేష్ దేశ్‌ముఖ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లోనే ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ప్లాన్ చేశారు. అక్టోబ రులో ‘భాగీ 3’ బృందం జార్జియా వెళ్లనుందని టాక్. -
యాక్షన్ సీక్వెల్లో మరోసారి శ్రద్ధా
బాలీవుడ్ సూపర్ హిట్ యాక్షన్ సిరీస్ బాఘీ. ఇప్పటికే రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సిరీస్‌లో ఇప్పుడు మూడో భాగం రెడీ అవుతోంది. తెలుగు సూపర్ హిట్ వర్షం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన బాఘీలో టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్లు జంటగా నటించారు. తరువాత మరో తెలుగు సూపర్ హిట్ క్షణంకు రీమేక్‌గా తెరకెక్కిన బాఘీ 2లో టైగర్‌కు జోడిగా దిశాపటాని అలరించారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న మూడో భాగానికి మరోసారి శ్రద్ధానే హీరోయిన్గా తీసుకున్నారు దర్శక నిర్మాతలు. ఈ విషయాన్ని నిర్మాత సాజిద్ నడియావాలా సోషల్ మీడియా ద్వారా కన్ఫామ్ చేశారు.అహ్మద్‌ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా 2020లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సాహోతో పాటు స్ట్రీట్ డ్యాన్సర్, చిచోరే సినిమాల్లో నటిస్తున్న శ్రద్ధా త్వరలోనే బాఘీ టీంతో జాయిన్ కానున్నారు. 💥 B O O M 💥#NGEFamily welcomes our very own @ShraddhaKapoor back to the franchise 🤩#BAAGHI3 it is 🔥@iTIGERSHROFF #SajidNadiadwala @khan_ahmedasas @foxstarhindi @WardaNadiadwala pic.twitter.com/rshCzA2S4A — Nadiadwala Grandson (@NGEMovies) 12 February 2019 -
భాగీ 2 వసూళ్ల సునామీ
సాక్షి, న్యూఢిల్లీ : విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించినా భాగీ 2 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. టైగర్ ష్రాఫ్ ఈ మూవీతో తొలిసారిగా 100 కోట్ల క్లబ్లో అడుగుపెట్డాడు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చారిత్రక దృశ్యకావ్యం పద్మావత్‌ను అధిగమించి 2018లో అత్యధిక ప్రారంభ వసూళ్లు దక్కించుకున్న భాగీ 2 మూడవ వారానికి రూ 155 కోట్లు వసూలు చేసింది. భాగీ 2 రూ 150 కోట్ల మార్క్‌ను దాటి మాస్, సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో బారీ వసూళ్లను రాబడుతోందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ మూవీ రూ 155.65 కోట్లు కలెక్ట్ చేసిందని వెల్లడించారు.టైగర్ ష్రాఫ్, దిశాపటానీ జంటగా తెరకెక్కిన భాగీ 2ను ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్వాలా నిర్మించారు. రియల్ లైఫ్‌లో డేటింగ్లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న టైగర్, దిశా ఆన్‌స్క్రీన్ కెమిస్ర్టీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. 2016లో తెలుగు సినిమా క్షణం రీమేక్‌గా బాలీవుడ్లో భాగీ తెరకెక్కి ఘనవిజయం దక్కించుకుంది. -
సల్మాన్ ఖాన్ కోసం..
ముంబై : కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. జంతు ప్రేమికులు ఈ తీర్పును స్వాగతించగా.. సల్మాన్ స్నేహితులు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సల్మాన్ కోసం ఆయన స్నేహితుడు, బాలీవుడ్ దర్శక నిర్మాత సాజిద్ నడియావాలా తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. తీర్పు వినగానే స్నేహితుడిని కలిసేందుకు జైపూర్ బయల్దేరారు. ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ వారం రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన బాఘీ 2 సక్సెస్ మీట్ కోసం భారీ ఏర్పాట్లు చేసుకున్న చిత్ర నిర్మాత సాజిద్ మిత్రుడి కోసం కార్యక్రమాన్ని రద్దు చేసుకుని స్నేహ బంధాన్ని చాటారు. సల్మాన్ ఖాన్ హీరోగా జుడ్వా, ముజ్ సే షాదీ కరోగీ వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన సాజిద్.. సల్మాన్ ఖాన్ ‘కిక్’ సినిమాతోనే దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం బాఘీ 2 విజయాన్ని ఆస్వాదిస్తున్న సాజిద్ త్వరలోనే ‘కిక్’ సీక్వెల్ ‘కిక్ 2 ’ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. -
రూ. వంద కోట్ల క్లబ్లో బాఘీ 2
సాక్షి, ముంబయి : టైగర్ ష్రాఫ్, దిశా పటానీ జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ బాఘీ 2కు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సూపర్ హిట్‌గా నిలిచింది. విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ మూవీ 100 కోట్ల రూపాయలతో క్లబ్లో చేరింది. 2018లో వంద కోట్ల క్లబ్లో చేరిన మూడో చిత్రం బాఘీ అని బాలీవుడ్ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. సబీర్ ఖాన్ హీరోపంటితో 2014లో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన టైగర్ ష్రాఫ్ బాఘీలో రోనీసింగ్గా లక్షలాది హృదయాలను కొల్లగొట్టాడు. తాజాగా బాఘీ 2లో రోన్నీగా ప్రేక్షకులను అలరించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ మూవీలో మనోజ్ బాజ్‌పాయ్, రణ్‌దీప్ హుడా, ప్రతీక్ బబ్బర్లూ తమ నటనతో ఆకట్టుకున్నారు. మరోవైపు బాఘీ 3తో ముందుకొస్తామని చిత్ర బృందం ప్రకటించడంతో టైగర్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. -
బాగీ 2 వసూళ్ల సునామీ
సాక్షి, ముంబయి : టైగర్ ష్రాఫ్, దిశా పటానీ జంటగా అహ్మద్‌ఖాన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాగీ 2 బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అంచనాలకు మించి వసూళ్లు రాబడుతూ 2018లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. తొలిరోజు రూ 25.10 కోట్లు వసూలు చేసిన బాగీ 2..శనివారం రెండవ రోజు రూ 20.40 కోట్లను రాబట్టి నిలకడగా దూసుకుపోతోంది. తొలి రెండు రోజుల్లో భారత్‌లో మొత్తం రూ 45.50 కోట్లు వసూలు చేసిందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. బాగీ 2 వసూళ్లు పద్మావత్, పాడ్‌మన్, రైడ్, సోను కి టిటు కి స్వీటీ చిత్రాల ఓపెనింగ్స్‌ను అధిగమించాయి. పద్మావత్ తొలిరోజు రూ 19 కోట్లు రాబట్టగా రూ 25.10 కోట్లు వసూలు చేసిన బాగి 2 భారీ మార్జిన్‌తో భన్సాలీ మూవీని క్రాస్ చేసింది. మూవీలో టైగర్ ష్రాఫ్ నటనను ప్రశంసిస్తూ బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్లు ట్వీట్ చేశారు. -
రిలీజ్ కాకముందే సీక్వెల్!
సాక్షి, సినిమా : బాలీవుడ్లో మరో సీక్వెల్ చిత్రాన్ని ప్రకటించేశారు. భాఘీ నుంచి మరో చిత్రం రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. సిరీస్‌లో రెండో చిత్రం విడుదల కాకముందే మూడో దానిని ప్రకటించటం విశేషం. టైగర్ ష్రాఫ్ హీరోగానే బాఘీ 3 సినిమా ఉండబోతున్నట్లు చెప్పేశారు. నిర్మాత సాజిద్ నడియా వాలా సొంత బ్యానర్ లోనే ఈ చిత్రం కూడా తెరకెక్కబోతోంది. బాఘీ 2 తెరకెక్కిస్తున్న అహ్మద్ ఖాన్ మూడో పార్ట్‌ను డీల్ చేయబోతున్నాడు. మిగతా తారాగణం త్వరలో ప్రకటించనున్నారు. బాఘీ మొదటి పార్ట్ తెలుగు వర్షం చిత్రం రీమేక్‌గా తెరకెక్కింది. సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహించగా.. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించింది. రెండో పార్ట్‌ను క్షణం రీమేక్‌గా అహ్మద్ ఖాన్ తెరకెక్కిస్తున్నాడు. దిశా పఠానీ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. క్లాసిక్ మూవీ బేతాబ్ లో మాధురి సాంగ్ ‘ఏక్ దో తీన్’ పాట రీమిక్స్‌పై జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చిందులు వేయనుంది. మార్చి 30న బాఘీ-2 విడుదల కానుంది. Drumrolls 🥁🎷 Our excitement level has just tripled! We are thrilled to share the 3rd instalment of #SajidNadiadwala’s Baaghi franchise starring @iTIGERSHROFF directed by @khan_ahmedasas#Baaghi3 @WardaNadiadwala pic.twitter.com/ijYdyIqbVs — Nadiadwala Grandson (@NGEMovies) 19 February 2018 -
అమ్మాయిలే ఎక్కువ మెసేజ్‌లు చేస్తున్నారు
సినిమా సినిమాకీ సరికొత్త పాత్రలు ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల్లో తనకుంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు సుధీర్‌బాబు. తెలుగులో హీరోగా చేస్తున్న ఆయన హిందీ ‘బాఘీ’ చిత్రంలో విలన్‌గా నటించి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన ‘బాఘీ’ విశేషాలు, భవిష్యత్ ప్రాజెక్ట్స్ వివరాలు చెప్పారు. ♦ ‘ఏమాయ చేశావే’ చిత్రంలో నెగటివ్ పాత్రలో టాలీవుడ్‌కి పరిచయమయ్యా. తెలుగు హిట్ మూవీ ‘వర్షం’కి రీమేక్‌గా తెరకెక్కిన ‘బాఘీ’ చిత్రంలో ప్రతినాయ కుడిగా బాలీవుడ్లో అడుగుపెట్టా. నేను హిందీలో విలన్‌గా నటించడంపై మొదట నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తరువాత అందరికీ నచ్చింది. యూ ట్యూబ్‌లో పన్నెండు వేల మంది వీక్షించారు. ♦ హీరోయిన్ శ్రద్ధాకపూర్ ఫాదర్ అయిన ప్రముఖ నటుడు శక్తీకపూర్ ఫోన్ చేసి బాగా నటించావు, బాలీవుడ్లో మరిన్ని అవకాశాలొస్తాయన్నారు. ఆయన అన్నట్టే ఆఫర్లు వస్తున్నాయి. ఏది పడితే అది ఒప్పుకోకుండా మంచి సినిమాలనే చేయాలనుకుంటున్నా. హిందీలో హీరోగా అయితేనే చేస్తా అనే షరతు విధించకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న ఏ పాత్ర అయినా చేస్తా. అవకాశం వస్తే తెలుగులో కూడా విలన్‌గా నటిస్తా. విలన్‌గా చేస్తే మహిళా ప్రేక్షకుల ఆదరణ తగ్గిపోతుందనుకున్నా. కానీ, ‘బాఘీ’ చూసిన తర్వాత ఎక్కువ మంది అమ్మాయిలే నన్ను అభినందిస్తూ మెసేజ్‌లు చేస్తున్నారు. ♦ ‘భలే మంచి రోజు’ చిత్రానికి కో డెరైక్టర్‌గా పనిచేసిన శ్రీరాం రెడ్డి చెప్పిన కథ నచ్చింది. ఈ నెలాఖరులో ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళతాం. దాని తర్వాత బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లో నటించేందుకు ప్లాన్ చేస్తున్నా. నేను బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడంతో ఆ పాత్రకు పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. తెలుగు, హిందీ భాషల్లో ఆ చిత్రం తెరకెక్కనుంది. -
తొలిరోజు కలెక్షన్లు రూ.12 కోట్లు
ముంబై: టైగర్ ష్రాఫ్, శ్రద్ధాకపూర్ నటించిన తాజా చిత్రం భాగీకి తొలిరోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. శుక్రవారం విడుదలైన ఈ సినిమా 11.87 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. తొలిరోజు కలెక్షన్లలో ఫ్యాన్ (19.20 కోట్లు), ఎయిర్‌లిఫ్ట్ (12.35 కోట్లు) సినిమాల తర్వాత భాగీ నిలిచింది. షబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో సాజిద్ నడియాడ్వాలా ఈ సినిమాను నిర్మించారు. దేశవ్యాప్తంగా 2750 స్రీన్లలో ఈ సినిమా విడుదలైంది. కాగా సినిమాకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. తెలుగు హీరో సుధీర్ బాబు ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించాడు. -
మూవీ రివ్యూ: 'వర్షం' రీమేక్ ఇలా ఉంది!
టైటిల్: భాగీ లేదా బాగీ జానర్: రొమాంటిక్ యాక్షన్ నటీనటులు: టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్, సుధీర్ బాబు, సునీల్ గ్రోవర్ తదితరులు డైరెక్టర్: షబ్బీర్ ఖాన్ నిర్మాత: సాజిద్ నడియావాలా రచన: సంజీవ్ దత్త్ నిడివి: 2 గంటల 16 నిమిషాలు విడుదల: ఏప్రిల్ 29, 2016 2015 మే నుంచి 2016 ఫిబ్రవరి వరకు యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ చుట్టూ 50 మంది ప్రత్యేక ప్రైవేట్ సెక్యూరిటీ పర్సన్స్ 24x7 కాపలా కాశారు. ఆ టైమ్ లో షూటింగ్ జరుపుకొన్న భాగీ సినిమాకు సంబంధించి ఒక్కస్టిల్ గానీ, టైగర్ లుక్ గానీ లీక్ కాకూడదని నిర్మాత సాజిద్ నడియావాలా అంత జాగ్రత్త తీసుకున్నారు. టైగర్ ఎలా కనిపిస్తాడో, ఏం చేస్తాడో సగటు ప్రేక్షకుడు 'అన్నీ హాల్లోనే' తెలుసుకోవాలని ఆయన ఉద్దేశం. అనుకున్నట్లే టైగర్ ష్రాఫ్ ఈ సినిమాలో ఫైట్ లు ఇరగదీశాడు. అంతేనా? ఇంకేం చెయ్యలేదా? అంటే.. మళ్లీ మళ్లీ ఫైట్లే చేస్తాడు. మొదట్లో, చివర్లో, మధ్యమధ్యలో హీరోయిన్ ని ప్రేమిస్తాడు కూడా! 'యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిషల కెరీర్ లను మలుపు తిప్పిన హిట్ సినిమా వర్షం (2004) రీమేకే ఈ హిందీ భాగీ' అని మనం అన్నా, అనుకున్నా.. సినిమాకు సంబంధించినవాళ్లు మాత్రం ఒప్పుకోరు. కానీ ఇది వర్షం రీమేకే! వర్షానికి తోడు ది రెయిడ్: రిడంప్షన్ సినిమా నుంచి యాక్షన్ సీక్వెన్స్ లను రిఫరెన్స్ పాయింట్లుగా (ప్రేక్షకుడి భాషలో కాపీ అనుకోవచ్చు) తీసుకున్నారు. టైగర్ ష్రాఫ్ తొలి సినిమా 'హీరోపంతీ' (తెలుగు 'పరుగు'కు రీమేక్) లా రెండో సినిమా భాగీ కూడా రీమేకే(రెండు సినిమాలకు దర్శకనిర్మాతలు ఒకరే) అని అధికారికంగా వెల్లడించలేదు. దీంతో ది రెయిడ్ నిర్మాతలు భాగీ నిర్మాత, హీరోలపై బాంబే హైకోర్టులో కేసు వేశారు. 'అసలు 'ది రెయిడ్' సినిమా ఎలా ఉంటుందో తెలియదు(!)' హీరో, ప్రొడ్యూసర్ వివరణ ఇవ్వడంతో కేసు ముగిసింది. కథేంటి? కథ పాతదే. ఇద్దరు బలవంతులైన యువకులు ఒకే (అందమైన) అమ్మాయిని ప్రేమించడం, హీరోయిన్ సహజంగానే గుడ్ బాయ్ వైపు మొగ్గుచూపి, బ్యాడ్ బాయ్ ని ఈసడించుకోవడం, చివరికి గుడ్ బాయ్ చేతిలో బ్యాడ్ బాయ్ అత్యంత బ్యాడ్ గా అంతరించడం రొటీన్. కాగా, భాగీలో ప్రత్యేకతలు ఏంటంటే వర్షం, కలరీ విద్యలు. పెద్ద నిర్మాత తీస్తున్న సినిమాతో తన కూతురిని హీరోయిన్ గా లాంచ్ చేసేందుకు ఓ తండ్రి ప్రయత్నిస్తుండగా, ఎవరో ఆ అమ్మాయిని కిడ్నీప్ చేస్తారు. అప్పుడా తండ్రి కూతురిని కాపాడుకునేందుకు ఓ భాగీ(తిరుగుబాటు చేసేవాడు లేదా ఎదురు తిరిగేవాడు)ని అద్దెకు తీసుకుంటాడు. అప్పటికే పలు యుద్ధకళల్లో ఆరితేరి ట్రైనర్ గా పనిచేస్తోన్న భాగీ.. విలన్లను చిత్తుచేసి ఆ అమ్మాయిని ఆమె తండ్రికి అప్పగిస్తాడు. కట్ చేస్తే ఆ అమ్మాయి, భాగీ మాజీ ప్రేమికులు. కొందరు చెప్పిన అబద్ధాల వల్ల విడిపోతారు. హీరోయిన్ కావాలనుకునే అమ్మాయిని ఎత్తుకెళ్లిన విలన్ కూడా హీరోకు మాజీ శత్రువు. ఇద్దరూ ఒకే గురువు దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకుని ఉంటారు. అసలీ డ్రామా ఎక్కడ మొదలైందంటే.. చలాకీ అమ్మాయి సియా(శ్రద్ధా కపూర్)కు వర్షమంటే చచ్చేంత ప్రేమ. అలా వర్షం కురుస్తున్న ఓ పట్టపగలు రైల్వే ఫ్లాట్ ఫామ్ పై ఆమె ఆనందంతో చిందులేస్తుండగా రోనీ(టైగర్ ష్రాఫ్), రాఘవ్ శెట్టి (సుధీర్ బాబు)ల కంటపడుతుంది. అంతే రోనీ, రాఘవ్ లు సియాతో ప్రేమలో పడిపోతారు. (రాఘవ్ ది ప్రేమకాదు మోహం అనుకోవాలి) పలు మార్లు కురిసే వర్షంలో తడుస్తూ సియా, రోనీలు దగ్గరవుతారు. సియా తండ్రి ఖురానా(కామెడీ షోల ఫేమ్ సునీల్ గ్రోవర్)కు మాత్రం ఆమెను పెద్ద హీరోయిన్ ను చెయ్యాలని ఉంటుంది. దీంతో చిన్నపాటి పన్నాగంతో వాళ్ల ప్రేమకు కామాపెట్టిస్తాడు. సినిమా షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లిన సియాను రాఘవ్ కిడ్నీప్ చేయించి ఓ భారీ భవంతిలో బంధిస్తాడు. ఆమెను విడిపించేందుకు వచ్చే రోనీకి, విలన్ గ్యాంగ్ లీడర్ రాఘవ్ కు మధ్య పాత శత్రుత్వం కూడా ఇక్కడ హైలైటే. కేరళలోని కొల్లాంలో గురుస్వామి (శౌర్యా భరధ్వాజ్) దగ్గర కరియపట్టు లేదా కలరీ అనే ప్రాచీన యుద్ధవిద్యలో శిక్షణ తీసుకుంటారు రాఘవ్, రోనీలు. మంచి కారణం కోసం తిరుగబాటు చేసేవాడే నిజమైన 'భాగీ' అని, నేర్చుకున్న విద్యలు సద్వినియోగం చేసుకోవాలనే గురువు ఉవాచను భిన్నధృవాలైన రాఘవ్, రోనీలు ఒక్కోలా అర్థం చేసుకుంటారు. రాఘవ్ పశుబల ప్రదర్శన కోసం తన విద్యలు వాడుకుంటే, రోనీ నిజమైన 'భాగీ' లా గెలిచి, సియా పెదవులు అందుకుంటాడు. టైగర్ తో తన్నులు తింటారా? విలన్ హీరోయిన్ ను భారీ భవంతిలో బంధిస్తాడని చెప్పుకున్నాంకదా, ఆ భవంతి ఒక్కో ఫ్లోర్ లో ఒక్కో వెరైటీ ఫైటర్లు ఉంటారు. ఒక ఫ్లోర్ లో కరాటే గ్యాంగ్ ఉంటే మరో ఫ్లోర్ లో కుంగ్ ఫూ, ఇంకోదాట్లో కత్తుల బ్యాచ్ కాపలా కాస్తుంటారు. కిల్లింగ్ లైసెన్సేదో తీసుకున్నట్లు అంతమందినీ ఒంటిచేత్తో ఫినిష్ చేస్తాడు టైగర్. ఫైట్లు చేసేటప్పుడు అతని శరీరసౌష్టవం చక్కగా ఎలివేట్ అవుతుంది. అయితే సూపర్ నేచురల్ తరహాలో సాగే భారీ ఫైట్ల మోతాదు మరీ శ్రుతిమించడం సినిమా చూడటానికి వచ్చామా? టైగర్ తో తన్నులు తినడానికి వచ్చామా? అనే భ్రాంతికి గురౌతారు ప్రేక్షకులు. తెలుగు సినిమాలను వరుసగా రీమేక్ లు చేస్తూ వాటికి బాలీవుడ్ మసాలా జోడించి హిట్లు కొట్టడంలో దిట్టగా పేరుపొందిన నడియావాలా.. ఈ సినిమాలో ఫైట్లనే మసాలాగా భావించినట్లనిపిస్తుంది. సియా- రోనీల ప్రేమ, రోనీ- రాఘవ్ ల శత్రుత్వాలకు సరైన లాజిక్ లు దొరకవు. కేరళలో తీసిన సీన్లు కంటికి ఇంపుగా ఉంటాయి. దాదాపు రూ.50 కోట్ల వ్యయంతో నిర్మితమైన భాగీ.. ప్రపంచ వ్యాప్తంగా 2500 స్క్రీన్లపై విడుదలైంది. ఈ సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోరర్ తో కలిపి ఐదుగురు సంగీత దర్శకులు పనిచేశారు. ఎలా చేశారు? మొదటి సినిమా(హీరోపంతీ) దర్శకనిర్మాతలతోనే రెండో సినిమాకు కూడా ఒప్పుకున్న టైగర్ ష్రాఫ్ కథ, కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. టైగర్ మీద మనం సాఫ్ట్ కార్నర్ తీసుకోవాల్సిన అవసరం ఎందుకో.. దేశవ్యాప్తంగా ఉన్న జమ్ లకు వెళితే తెలుస్తుంది. (చక్కటి ఫిజిక్ తో, ఎప్పటికప్పుడు రకరకాల ప్యాక్ లలో కనిపించే టైగర్ నిలువెత్తు బొమ్మలు అన్ని జిమ్ లలో కొలువయ్యాయి) ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటున్న టైగర్ మూడో సినిమా 'ఎ ఫ్లైయింగ్ జాట్' బిజినెస్ పై భాగీ ప్రభావం చూపుతుందో లేదో ఇంకొద్ది నెలల్లో తెలుస్తుంది. శ్రద్ధా కపూర్ ఎప్పటిలాగే పాత్రలో జీవించాలని ప్రయత్నించి.. సోసోగా చేసింది. వెండితెరపై శ్రద్ధాను బికినీలో చూడటం, టైగర్ లో లిప్ లాక్ కొందరికి నచ్చుతాయి. కొసమెరుపు తెలుగు ప్రేక్షకుడి దృష్టికోణంలో ఈ సినిమాలో నచ్చే ఏకైక అంశం సుధీర్ బాబు. టాలీవుడ్ లో అడపాదడపా హిట్లు కొడుతూ, మంచి నటుడిగా ఎదుగుతున్న సుధీర్.. భాగీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా విలన్ గా. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు.. 'విలన్ సుధీర్ బాబే హీరోలా ఉన్నాడు'అని చాలా మంది తెలుగేతర వ్యక్తులు అనుకుని ఉంటారు!