
సాక్షి, ముంబయి : టైగర్ ష్రాఫ్, దిశా పటానీ జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ బాఘీ 2కు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సూపర్ హిట్‌గా నిలిచింది. విడుదలైన ఆరు రోజుల్లోనే ఈ మూవీ 100 కోట్ల రూపాయలతో క్లబ్‌లో చేరింది. 2018లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన మూడో చిత్రం బాఘీ అని బాలీవుడ్ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
సబీర్ ఖాన్ హీరోపంటితో 2014లో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన టైగర్ ష్రాఫ్ బాఘీలో రోనీసింగ్‌గా లక్షలాది హృదయాలను కొల్లగొట్టాడు. తాజాగా బాఘీ 2లో రోన్నీగా ప్రేక్షకులను అలరించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ మూవీలో మనోజ్ బాజ్‌పాయ్, రణ్‌దీప్ హుడా, ప్రతీక్ బబ్బర్‌లూ తమ నటనతో ఆకట్టుకున్నారు. మరోవైపు బాఘీ 3తో ముందుకొస్తామని చిత్ర బృందం ప్రకటించడంతో టైగర్ అభిమానులు ఖుషీ అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment