తొలిరోజు కలెక్షన్లు రూ.12 కోట్లు | Baaghi box office collection: Rs 11.87 crore on its opening day | Sakshi
Sakshi News home page

తొలిరోజు కలెక్షన్లు రూ.12 కోట్లు

Published Sat, Apr 30 2016 12:50 PM | Last Updated on Sun, Sep 3 2017 11:07 PM

తొలిరోజు కలెక్షన్లు రూ.12 కోట్లు

తొలిరోజు కలెక్షన్లు రూ.12 కోట్లు

ముంబై: టైగర్ ష్రాఫ్, శ్రద్ధాకపూర్ నటించిన తాజా చిత్రం భాగీకి తొలిరోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. శుక్రవారం విడుదలైన ఈ సినిమా 11.87 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. తొలిరోజు కలెక్షన్లలో ఫ్యాన్ (19.20 కోట్లు), ఎయిర్లిఫ్ట్ (12.35 కోట్లు) సినిమాల తర్వాత భాగీ నిలిచింది.

షబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో సాజిద్ నడియాడ్వాలా ఈ సినిమాను నిర్మించారు. దేశవ్యాప్తంగా 2750 స్రీన్లలో ఈ సినిమా విడుదలైంది. కాగా సినిమాకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. తెలుగు హీరో సుధీర్ బాబు ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement