opening day
-
రికార్డులు రప్పా రప్పా...
‘‘ఆ బిడ్డ మీద ఒక్క చిన్న గీత పడాలా... గంగమ్మ తల్లి జాతరలో యాటను నరికినట్లు రప్పా రప్పా నరుకుతా.. ఒక్కొక్కడిని రప్పా రప్పా రప్పా...’’ అంటూ విలన్లకి వార్నింగ్ ఇస్తాడు పుష్పరాజ్. ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంలో హీరో అల్లు అర్జున్ చెప్పిన బోలెడన్ని పవర్ఫుల్ డైలాగ్స్‌లో ఇదొకటి. ఇక ఇక్కడ పేర్కొన్న డైలాగ్‌లానే రప్పా రప్పా అంటూ ఇప్పటివరకూ ఉన్న రికార్డులను చెరిపేసి, సరికొత్త రికార్డులను సృష్టించారు అల్లు అర్జున్.ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమా సాధించని విధంగా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రూ. 294 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డులను సెట్ చేసింది ‘పుష్ప2: ది రూల్’ సినిమా.అల్లు అర్జున్, రష్మికా మందన్నా జోడీగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేక పాటలో నటించారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా గురువారం (డిసెంబరు 5)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే డిసెంబరు 4న రాత్రి 9:30 గంటల నుంచి ప్రారంభమైన ప్రీమియర్స్‌కి అనూహ్యమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్స్‌లో ఈ చిత్రం విడుదలైంది. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకూ ఏ సినిమా సాధించని విధంగా మొదటి రోజు రూ. 294 కోట్ల గ్రాస్‌తో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఇండియాలో ఇప్పటివరకు మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ (2022) రూ. 233 కోట్ల గ్రాస్‌తో ప్రథమ స్థానంలో ఉంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. అయితే రూ. 294 కోట్ల గ్రాస్ వసూళ్లతో ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును బ్రేక్ చేసింది ‘పుష్ప 2: ది రూల్’.అదే విధంగా నైజాంలోనూ రికార్డులను తిరగ రాసింది ‘పుష్ప 2’. ఇప్పటివరకూ మొదటి రోజు వసూళ్లలో రూ. 23కోట్ల గ్రాస్‌తో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం మొదటి స్థానంలో ఉండగా, రూ. 30 కోట్ల గ్రాస్ వసూళ్లతో సరికొత్త రికార్డుని సృష్టించి, మొదటి స్థానంలో నిలిచింది ‘పుష్ప 2: ది రూల్’. హిందీలోనూ తొలి రోజు రూ. 72 కోట్ల వసూళ్లతో ‘పుష్ప 2’ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్లో ఇప్పటివరకు మొదటిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ రూ. 65.5 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. అయితే, తాజాగా ‘పుష్ప 2’ రూ. 72 కోట్ల వసూళ్లతో ‘జవాన్’ని రెండో స్థానానికి పరిమితం చేసింది. హిందీలో షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్‌కు కూడా సాధ్యం కాని రికార్డులను అల్లు అర్జున్ క్రియేట్ చేశారు. ‘పుష్ప: ది రైజ్’ (2021) చిత్రంలో తన అద్భుతమైన నటనకుగానూ జాతీయ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కావడం, ఆయనకి జాతీయ అవార్డు రావడంతో ఉత్తరాదిలోనూ అల్లు అర్జున్‌కి స్టార్డమ్, ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. ఈ కారణంగానే హిందీలో ‘పుష్ప 2’కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. మరి... రానున్న రోజుల్లో రప్పా రప్పా అంటూ ‘పుష్ప 2’ ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో వేచి చూడాల్సిందే. -
తొలిరోజు కలెక్షన్లు రూ.12 కోట్లు
ముంబై: టైగర్ ష్రాఫ్, శ్రద్ధాకపూర్ నటించిన తాజా చిత్రం భాగీకి తొలిరోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. శుక్రవారం విడుదలైన ఈ సినిమా 11.87 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. తొలిరోజు కలెక్షన్లలో ఫ్యాన్ (19.20 కోట్లు), ఎయిర్‌లిఫ్ట్ (12.35 కోట్లు) సినిమాల తర్వాత భాగీ నిలిచింది. షబ్బీర్ ఖాన్ దర్శకత్వంలో సాజిద్ నడియాడ్వాలా ఈ సినిమాను నిర్మించారు. దేశవ్యాప్తంగా 2750 స్రీన్లలో ఈ సినిమా విడుదలైంది. కాగా సినిమాకు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. తెలుగు హీరో సుధీర్ బాబు ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో నటించాడు. -
ఆ సిన్మా తొలిరోజు కలెక్షన్లలో దుమ్మురేపింది!
ముంబై: అర్జున్ కపూర్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటించిన 'కి అండ్ కా' భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియోటివ్ డైరెక్టర్ ఆర్ బాల్కీ తెరకెక్కించిన ఈ సినిమాపై రివ్యూలు పెదవి విరిచినప్పటికీ, కలెక్షన్లు మాత్రం అదరగొట్టేశాయి. తొలిరోజే ఈ సినిమా ఏడు కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో తొలి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రం ఇదే. తొలిరోజు 40-50శాతం ఆక్యూపెన్సీతో ఈ సినిమా థియేటర్లు కళకళలాడాయి. మొదటి వీకెండ్లో ఈ ట్రెండ్ మరింతగా కొనసాగి.. ఈ చిత్రం తొలివారం భారీగా కలెక్షన్లు రాబట్టే సూచనలు కనిపిస్తున్నాయి. 'కి అండ్ కా'లో కబీర్‌గా అర్జున్, 'కియా' కరీనా నటించింది. ఈ సినిమాలో ఇంటి బాధ్యతలు చూసుకొనే భర్తగా అర్జున్, కెరీరే ముఖ్యమనుకునే దృక్పథంతో జాబ్ చేసే మహిళగా కరీనా నటించారు. ఇల్లాలిలా ఇంటి పనులు చూసుకొనే భర్త.. ఇంటి యాజమానిగా ఉద్యోగం చేసే భార్య కథతో న్యూ ఏజ్ సినిమాగా 'కి అండ్ కా'కు భారీ ప్రచారమే లభించింది. -
తొలి రోజు రూ. 27 కోట్లు వసూలు
న్యూఢిల్లీ: బజరంగీ భాయ్‌జాన్ చిత్రం తొలి రోజే రూ.27 కోట్లు వసూళు చేసింది. ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ నటించిన అన్ని చిత్రాల రికార్డులను ఈ చిత్రం చెరిపేసింది. సెలవు కాకుండా శుక్రవారం రోజు రిలీజై ఇంతగా కలెక్షన్లని రాబట్టిందని చిత్ర యూనిట్ సభ్యుడు ఒకరు తెలిపారు. ఇక వారంతమైన శని, ఆదివారాల్లో మరింతగా కలెక్షన్లను రాబట్టవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రం 5000 స్క్రిన్స్లో ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో విడుదలయింది.వెండితెరపై చాలా కాలం తరువాత గుబాళించిన మానవతా పరిమళంగా 'బజరంగీ భాయ్‌జాన్' శుక్రవారం రిలీజైంది. కథ విషయానికొస్తే...అన్నీ లెక్కలేసుకొనే చేస్తే దాన్ని జీవితమనీ, మనల్ని మనుషులనీ ఎవరూ అనరు. అనలేరు. యంత్రానికి లేని మనసుంది కాబట్టే, మనం ప్రత్యేకమయ్యాం. కొన్ని భావాలకూ, బంధాలకూ లాజిక్‌లు ఉండవు. అది అంతే! కానీ, మనకు మనమే కులం, మతం, ప్రాంతం, భాష, దేశం - అనే విభజన రేఖలు గీసుకున్నాం. మన లాంటి తోటి మనిషిని కూడా ఈ మరుగుజ్జు ప్రమాణాలతో జడ్జ్ చేయడానికి ప్రయత్నిస్తాం. సాటివాడికి చేయందించడానికి కూడా ఈ లెక్కలు వేస్తాం. సరిగ్గా అలాంటి మనస్తత్త్వమున్న మన లాంటి ఒక వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో తన దేశం, మతం కాని ఒక చిన్నారికి దగ్గరైతే? మాటలు రాని ఆరేళ్ల ఆ మూగ చిన్నారిని సురక్షితంగా తన ఇంటికి చేర్చడానికి జీవితాన్నే రిస్క్‌లో పడేసుకుంటే? ఆ క్రమంలో డబ్బు, ప్రేమ, పెళ్ళి, చివరకు ప్రాణం కూడా పణంగా ఒడ్డడానికి సిద్ధపడితే? మనుషుల మధ్య పెరగాల్సింది ప్రేమే తప్ప, కుల, మత, ప్రాంతాల పేరిట ద్వేషం కాదని గుర్తు చేసేలా 'బజరంగీ భాయ్‌జాన్' తెరకెక్కింది.