ఆ సిన్మా తొలిరోజు కలెక్షన్లలో దుమ్మురేపింది! | Ki and Ka mints 7.30 crore on opening day | Sakshi
Sakshi News home page

ఆ సిన్మా తొలిరోజు కలెక్షన్లలో దుమ్మురేపింది!

Published Sat, Apr 2 2016 7:54 PM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM

ఆ సిన్మా తొలిరోజు కలెక్షన్లలో దుమ్మురేపింది!

ఆ సిన్మా తొలిరోజు కలెక్షన్లలో దుమ్మురేపింది!

ముంబై: అర్జున్ కపూర్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటించిన 'కి అండ్ కా' భారీ అంచనాల మధ్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియోటివ్ డైరెక్టర్ ఆర్ బాల్కీ తెరకెక్కించిన ఈ సినిమాపై రివ్యూలు పెదవి విరిచినప్పటికీ, కలెక్షన్లు మాత్రం అదరగొట్టేశాయి. తొలిరోజే ఈ సినిమా ఏడు కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో తొలి రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రం ఇదే.

తొలిరోజు 40-50శాతం ఆక్యూపెన్సీతో ఈ సినిమా థియేటర్లు కళకళలాడాయి. మొదటి వీకెండ్‌లో ఈ ట్రెండ్ మరింతగా కొనసాగి.. ఈ చిత్రం తొలివారం భారీగా కలెక్షన్లు రాబట్టే సూచనలు కనిపిస్తున్నాయి. 'కి అండ్ కా'లో కబీర్‌గా అర్జున్‌, 'కియా' కరీనా నటించింది. ఈ సినిమాలో ఇంటి బాధ్యతలు చూసుకొనే భర్తగా అర్జున్‌, కెరీరే ముఖ్యమనుకునే దృక్పథంతో జాబ్‌ చేసే మహిళగా కరీనా నటించారు. ఇల్లాలిలా ఇంటి పనులు చూసుకొనే భర్త.. ఇంటి యాజమానిగా ఉద్యోగం చేసే భార్య కథతో న్యూ ఏజ్ సినిమాగా 'కి అండ్ కా'కు భారీ ప్రచారమే లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement