
బాక్సాఫీస్ వద్ద భాగీ 2 వసూళ్ల వర్షం
సాక్షి, న్యూఢిల్లీ : విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించినా భాగీ 2 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. టైగర్ ష్రాఫ్ ఈ మూవీతో తొలిసారిగా 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్డాడు. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చారిత్రక దృశ్యకావ్యం పద్మావత్‌ను అధిగమించి 2018లో అత్యధిక ప్రారంభ వసూళ్లు దక్కించుకున్న భాగీ 2 మూడవ వారానికి రూ 155 కోట్లు వసూలు చేసింది. భాగీ 2 రూ 150 కోట్ల మార్క్‌ను దాటి మాస్, సింగిల్ స్ర్కీన్ థియేటర్లలో బారీ వసూళ్లను రాబడుతోందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
దేశవ్యాప్తంగా ఈ మూవీ రూ 155.65 కోట్లు కలెక్ట్ చేసిందని వెల్లడించారు.టైగర్ ష్రాఫ్, దిశాపటానీ జంటగా తెరకెక్కిన భాగీ 2ను ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో సాజిద్ నడియాద్‌వాలా నిర్మించారు. రియల్ లైఫ్‌లో డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతున్న టైగర్, దిశా ఆన్‌స్క్రీన్ కెమిస్ర్టీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. 2016లో తెలుగు సినిమా క్షణం రీమేక్‌గా బాలీవుడ్‌లో భాగీ తెరకెక్కి ఘనవిజయం దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment