సల్మాన్‌ ఖాన్‌ కోసం.. | Sajid Nadiadwala Cancels Baaghi 2 Success Bash For Salman Khan | Sakshi
Sakshi News home page

బాఘీ 2 సక్సెట్‌ మీట్‌ రద్దు..!

Published Fri, Apr 6 2018 1:28 PM | Last Updated on Fri, Apr 6 2018 1:28 PM

Sajid Nadiadwala Cancels Baaghi 2 Success Bash For Salman Khan - Sakshi

సల్మాన్‌ ఖాన్‌, సాజిద్‌ నడియావాలా (పాత చిత్రం)

ముంబై : కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జోధ్‌పూర్‌ ట్రయల్‌ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. జంతు ప్రేమికులు ఈ తీర్పును స్వాగతించగా.. సల్మాన్‌ స్నేహితులు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సల్మాన్‌ కోసం ఆయన స్నేహితుడు, బాలీవుడ్‌ దర్శక నిర్మాత సాజిద్‌ నడియావాలా తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. తీర్పు వినగానే స్నేహితుడిని కలిసేందుకు జైపూర్‌ బయల్దేరారు.

ప్రస్తుతం బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తూ వారం రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన బాఘీ 2 సక్సెస్‌ మీట్‌ కోసం భారీ ఏర్పాట్లు చేసుకున్న చిత్ర నిర్మాత సాజిద్‌ మిత్రుడి కోసం కార్యక్రమాన్ని రద్దు చేసుకుని స్నేహ బంధాన్ని చాటారు. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా జుడ్వా, ముజ్‌ సే షాదీ కరోగీ వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన సాజిద్‌.. సల్మాన్‌ ఖాన్‌ ‘కిక్‌’ సినిమాతోనే దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం బాఘీ 2 విజయాన్ని ఆస్వాదిస్తున్న సాజిద్‌ త్వరలోనే ‘కిక్‌’ సీక్వెల్‌ ‘కిక్‌ 2 ’ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement