
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న బాగీ 2
సాక్షి, ముంబయి : టైగర్ ష్రాఫ్, దిశా పటానీ జంటగా అహ్మద్‌ఖాన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాగీ 2 బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అంచనాలకు మించి వసూళ్లు రాబడుతూ 2018లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. తొలిరోజు రూ 25.10 కోట్లు వసూలు చేసిన బాగీ 2..శనివారం రెండవ రోజు రూ 20.40 కోట్లను రాబట్టి నిలకడగా దూసుకుపోతోంది.
తొలి రెండు రోజుల్లో భారత్‌లో మొత్తం రూ 45.50 కోట్లు వసూలు చేసిందని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. బాగీ 2 వసూళ్లు పద్మావత్, పాడ్‌మన్, రైడ్, సోను కి టిటు కి స్వీటీ చిత్రాల ఓపెనింగ్స్‌ను అధిగమించాయి. పద్మావత్ తొలిరోజు రూ 19 కోట్లు రాబట్టగా రూ 25.10 కోట్లు వసూలు చేసిన బాగి 2 భారీ మార్జిన్‌తో భన్సాలీ మూవీని క్రాస్ చేసింది. మూవీలో టైగర్ ష్రాఫ్ నటనను ప్రశంసిస్తూ బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్‌లు ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment