
‘డార్లింగ్స్ రేపు మీ అందరికీ ఓ సర్‌ప్రైజ్ ఉంది’ అని సోమవారం అభిమానులను ఉద్దేశించి ప్రభాస్ అన్నారు. అంతే... ఆ సర్‌ప్రైజ్ ఏమై ఉంటుందా? అనే చర్చ మొదలైంది. ‘సాహో’ కొత్త పోస్టర్ అని, టీజర్ రిలీజ్ అని, మేకింగ్ వీడియో అని రకరకాలుగా ఊహించుకున్నారు. కొందరి ఊహను ప్రభాస్ నిజం చేస్తూ మంగళవారం తన తాజా చిత్రం ‘సాహో’ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి, సినిమా రిలీజ్ డేట్‌ను కూడా కన్ఫార్మ్ చేశారు. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సాహో’.
ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. మంగళవారం విడుదలైన ‘సాహో’ కొత్త పోస్టర్‌లో సీరియస్ అండ్ ఇంటెన్స్ లుక్స్‌తో ప్రభాస్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ‘‘ఆల్రెడీ రిలీజ్ చేసిన ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1, షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2’ వీడియోలకి మంచి స్పందన లభించింది. తాజాగా విడుదల చేసిన ప్రభాస్ కొత్త పోస్టర్‌కు అంతే అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని నిర్మాతలు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment