
శ్రద్ధా కపూర్
ఈ ఏడాది ‘స్త్రీ, బట్టీగుల్ మీటర్ చాలు’ సినిమాల సక్సెస్‌తో జోరు మీద ఉన్నారు కథానాయిక శ్రద్ధా కపూర్. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ సైనాలోనూ శ్రద్ధానే టైటిల్ రోల్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో హిందీ చిత్రం ‘చిచోరే’కి పచ్చజెండా ఊపారు శ్రద్ధా. రీసెంట్‌గా హాలీడేని ఎంజాయ్ చేసిన శ్రద్ధా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, వరుణ్ శర్మ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో కాలేజ్ అమ్మాయిగా, మిడిల్ ఏజ్డ్ మహిళగా రెండు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు శ్రద్ధా. అంటే.. అమ్మాయిగా, ఆంటీగా కనిపిస్తారన్న మాట. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే ప్రభాస్ ‘సాహో’ సినిమాతో ఈ బాలీవుడ్ బ్యూటీ సౌత్‌కి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇలా వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు శ్రద్ధా.
Comments
Please login to add a commentAdd a comment