పకడో పకడో | Saaho shooting next schedule in Romania | Sakshi
Sakshi News home page

పకడో పకడో

Published Mon, Oct 22 2018 1:50 AM | Last Updated on Wed, Jul 17 2019 10:14 AM

Saaho shooting next schedule in Romania - Sakshi

ప్రభాస్‌

విలన్స్‌ను పట్టుకోవడానికి చేజింగ్‌కి రెడీ అవుతున్నారు ప్రభాస్‌. మరి ఈ చేజింగ్‌కి కారణం తెలియాలంటే ‘సాహో’ సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సాహో’. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. యువీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఓ చేజింగ్‌ సన్నివేశం కోసం రొమేనియా వెళ్లానున్నారట చిత్రబృందం. ప్రభాస్, నీల్‌ నితిన్‌ ముఖేష్‌లపై ఈ చేజింగ్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తారట. సుమారు వారానికిపైగా ఈ షెడ్యూల్‌ ఉంటుందని టాక్‌. ఈ నెల 23న ప్రభాస్‌ బర్త్‌డే సందర్భంగా ‘సాహో’ సినిమా అప్‌డేట్‌ ఇస్తామని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. పోస్టర్‌తో పాటు, చిత్రం మేకింగ్‌ వీడియోని రిలీజ్‌ చేస్తారని వినికిడి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement