
శ్రద్ధా కపూర్
...అంటున్నారు బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్. ఇంతకీ ఎక్కడికి వచ్చారంటే ‘సాహో’ సెట్లోకి. బాలీవుడ్‌లో చేస్తున్న ‘బట్టీ గుల్ మీటర్ చాలు’ కోసం ‘సాహో’ సినిమాకు చిన్న బ్రేక్ ఇచ్చారు శ్రద్ధ. అక్కడ షెడ్యూల్ కంప్లీట్ అవ్వడంతో మళ్లీ ఇక్కడికి రిటర్న్ అయ్యారు. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారని సమాచారం. ప్రభాస్‌తో పాటు కొన్ని స్టంట్స్ కూడా చేస్తారట. అంతేకాదండోయ్ ‘సాహో’ చిత్రకథ అంతా శ్రద్ధా పాయింట్ నుంచే నడుస్తుందట. ప్రస్తుతం ‘సాహో’ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment