
లంచ్ అయితే ఏంటి? డిన్నర్ అయితే ఏంటి? కొంతమందికి కక్కాముక్కలు లేకపోతే నోట్లో ముద్ద దిగదు! బీటౌన్ బ్యూటీ శ్రద్ధా కపూర్ మరీ అంత నాన్–వెజ్ లవరో? కాదో? తెలీదు గానీ... ముద్దల్లో కక్కాముక్కల్ని కలుపుకుని శ్రద్ధగా తినేవారు. సారీ.. తింటుంటారు! బట్, నెక్ట్స్ ఇయర్ నుంచి నాన్–వెజ్‌కి ‘నో’ చెప్పేశారు. శ్రద్ధాలో మార్పుకు కారణం ‘పెటా’ (జంతు సంరక్షణ సంస్థ). వెజిటేరియన్‌లో ఎన్ని రుచికరమైన వంటలు ఉన్నాయో.. రెసిపీలతో ఓ పుస్తకాన్ని శ్రద్ధాకి పంపించారు ‘పెటా’ నిర్వాహకులు. అవన్నీ చూసి... ‘‘థ్యాంక్స్ ‘పెటా’. 2018లో వెజ్జే ప్రయత్నిస్తా’’ అన్నారు.
ప్రభాస్‌కి జోడీగా ‘సాహో’లో నటిస్తున్న ఈ సుందరి షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు కక్కాముక్కలు తెగ లాగించేశారు. ప్రభాస్ అండ్ కో ఆతిథ్యం అటువంటిది మరి! చికెన్–మటన్, చేపలు–పీతలు... లంచ్‌లో ఆల్మోస్ట్ 20 టు 25 ఐటమ్స్ వడ్డించారు. అవన్నీ ఫొటోలు తీసి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లలో పెట్టారీమె. బహుశా... అవన్నీ చూసే శ్రద్ధాకు ‘పెటా’ వాళ్లు ఈ వెజ్ రెసిపీలు పంపారంటారా? ఏమో! ఈ సంగతి పక్కన పెడితే... సోమవారం చిల్డ్రన్స్‌డే (బాలల దినోత్సవం) సందర్భంగా ఉదయం ముంబైలోని ప్రభాదేవి మున్సిపల్ స్కూల్‌కి వెళ్లిన శ్రద్ధా, చాలాసేపు అక్కడి పిల్లలతో కబుర్లు చెబుతూ, ఆటలు ఆడుతూ గడిపారు. సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment