నన్నడిగితే నాకేం తెలుసు! | Shraddha Kapoor about Prabhas’s wedding | Sakshi
Sakshi News home page

నన్నడిగితే నాకేం తెలుసు!

Published Sun, Jan 28 2018 5:21 AM | Last Updated on Sun, Jan 28 2018 5:21 AM

Shraddha Kapoor about Prabhas’s wedding - Sakshi

శ్రద్ధాకపూర్‌

తమిళసినిమా: ఆ విషయం నాకేం తెలుసు ఆయన్నే అడగండి అంటోంది నటి శ్రద్ధాకపూర్‌. ఇంతకీ ఈ అమ్మడు చెప్పేదేంటో చూద్దామా. బాహుబలి సిరీస్‌ తరువాత నటుడు ప్రభాష్‌ నటిస్తున్న తాజా చిత్రం సాహో. భారీ బడ్జెట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్‌ నాయకిగా నటిస్తోంది. ఇందుకు గానూ ఈ బ్యూటీ రూ.3 కోట్లు పారితోషికం పుచ్చుకుంటోందట. బాహుబలి చిత్రం తరువాత ప్రభాష్‌ మార్కెట్‌ ప్రపంచ స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో సాహో చిత్రాన్ని  తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అందుకే మొదట దక్షిణాది భాషలకు చెందిన నటీమణుల్లో ఒకరిని హీరోయిన్‌గా ఎంపిక చేయాలని భావించినా, ఇతర భాషల్లోనూ సాహోను విడుదల చేయాలని భావించడంతో నటి శ్రద్ధాకపూర్‌ను ఎంపిక చేశారు. ఈ చిత్రంతో ఈ భామ దక్షిణాది చిత్రపరిశ్రమకు పరిచయం కాబోతోందన్నమాట. నటుడు ప్రభాష్‌ గురించి చెప్పమని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు శ్రద్ధాకపూర్‌ బదులిస్తూ ఆయన మంచి నటుడు మాత్రమే కాదు మంచి మనసున్న మనిషి అని కితాబిచ్చేసింది. అంతే కాదు ప్రభాస్‌తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది.

నటుడు ప్రభాస్, అనుష్క గురించి రకరకాల గ్యాసిప్స్‌ ప్రచారంలో ఉన్న విషయం తలిసిందే. వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం హోరెత్తుతోంది. అయితే పుకార్లకు పుల్‌స్టాప్‌ పెట్టేలా ఇటీవల ప్రభాస్‌ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని, అంతకు మించి తమ మధ్య ఏమీ లేదని స్పష్టంగా చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్‌ వివాహం గురించి తనను అడుగుతున్నారని నటి శ్రద్ధాకపూర్‌ పేర్కొంది. అయితే ఆ విషయం గురించి తనకేమీ తెలియదని ఆయన్నే అడగాలని చెప్పింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement