
శ్రద్ధాకపూర్
ముంబై, హైదరాబాద్‌ల మధ్య చక్కర్లు కొడుతున్నారు హీరోయిన్ శ్రద్ధాకపూర్. హిందీ చిత్రాలు ‘చిచోరి, సైనా’ల కోసం ముంబై స్టూడియోల చుట్టూ తిరుగుతున్న ఆమె ‘సాహో’ కోసం హైదరాబాద్ వచ్చారు. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సాహో’. ఇందులో కథానాయికగా నటిస్తున్నారు శ్రద్దా.
రీసెంట్‌గా యాక్షన్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసిన టీమ్ తాజాగా స్టార్ట్ అయిన కొత్త షెడ్యూల్‌లో హీరో, హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ షెడ్యూల్‌లో పాల్గొనడానికే శ్రద్ధా హైదరాబాద్‌లో వాలిపోయారు. నీల్‌నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, మురళీ శర్మ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు మది కెమెరామేన్. వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment