
హైదరాబాద్‌లో ఉంటే ఇంట్లో ఉన్నట్టే ఉందని శ్రద్ధాకపూర్ చెబుతున్నారు. ప్రభాస్ అండ్ కో ఆతిథ్యం అటువంటిది మరి! చేపలు–పీతలు, చికెన్–మటన్, పనీర్–పుట్టగొడుగులు... ఒకటా? రెండా? ఆల్మోస్ట్ ఇరవైఐదు ఐటమ్స్, ప్రతి రోజూ భోజనంలో శ్రద్ధాకు వడ్డించారు. షాట్ టు షాట్, షూటింగులో గ్యాప్స్ మధ్య బోర్ కొట్టకుండా ఉండడానికి సెట్‌లోనే చిన్న గేమింగ్ జోన్ ఏర్పాటు చేశారు.
హైదరాబాద్‌లో ‘సాహో’ షూటింగ్ చేసినన్ని రోజులూ శ్రద్ధాకు ఫుడ్ అండ్ ఫన్ ఫెస్టివలే. ప్రభాస్ హీరోగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ‘సాహో’ సినిమా ఫస్ట్ షెడ్యూల్ మంగళవారంతో ముగిసింది. ముంబయ్ వెళుతూ వెళుతూ తనకు బాధగానూ, సంతోషంగానూ ఉందని శ్రద్ధాకపూర్ పేర్కొన్నారు. ‘‘సాహో’ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. అద్భుతమైన టీమ్‌తో పని చేయడం గొప్ప అనుభూతి. హైదరాబాద్‌లో ఉంటే ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది’’ అన్నారామె.
Comments
Please login to add a commentAdd a comment