32క్లాసెస్‌కు వెళ్లా! | Shraddha Kapoor at Badminton player Saina Nehwal Biopic | Sakshi
Sakshi News home page

32క్లాసెస్‌కు వెళ్లా!

Published Sat, Sep 9 2017 12:33 AM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM

32క్లాసెస్‌కు వెళ్లా!

32క్లాసెస్‌కు వెళ్లా!

సెంటర్‌ లైన్, బ్యాక్‌ బౌండరీ లైన్, లాంగ్‌ సర్వీస్‌ లైన్‌... బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ ప్రతిరోజూ ఈ లైన్స్‌ గురించే తెలుసుకుంటున్నారట. ఆ లైన్స్‌తో ఈ బ్యూటీకి సంబంధం ఏంటనేగా మీ డౌట్‌. మరేం లేదు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో శ్రద్ధా కపూర్‌ నటించనున్న సంగతి తెలిసిందే.

‘‘ఉదయాన్నే ఐదు గంటలకు లేచి, బ్యాడ్మింటన్‌ క్లాసెస్‌కు వెళుతున్నా. ఇప్పటివరకు 32 క్లాసెస్‌కు ఎటెండ్‌ అయ్యాను. ఈ సినిమా పూర్తయిన తర్వాత కూడా ఆట ప్రాక్టీస్‌ చేస్తాను. సైనా ది, నాది సేమ్‌ హైట్‌. తన పాత్రకు న్యాయం చేయగలుగుతానని నా నమ్మకం’’ అన్నారామె. ‘సాహో’ చిత్రం ద్వారా శ్రద్ధా తెలుగు తెరకు పరిచయం కానున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement